Komuram Bheem Asifabad:టార్చర్ పెడుతున్న ఈ ప్రిన్సిపల్ మాకొద్దు..రోడ్డెక్కిన విద్యార్థినులు!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులు బుధవారం ఉదయం రోడ్డెక్కారు. టార్చర్ పెడుతున్న ఈ ప్రిన్సిపల్ మాకొద్దంటూ.. విద్యార్థినులు ఉదయం ఎనిమిది గంటలకు ఒక్కసారిగా మార్కెట్ ఏరియాలోని రోడ్లపై పరుగులు పెట్టారు. దీంతో ఏం జరుగుతోందో అర్థం కాక స్థానికులు హడలెత్తిపోయారు.

Komuram Bheem Asifabad:టార్చర్ పెడుతున్న ఈ ప్రిన్సిపల్ మాకొద్దు..రోడ్డెక్కిన విద్యార్థినులు!
New Update

Komuram Bheem Asifabad:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులు బుధవారం ఉదయం రోడ్డెక్కారు. టార్చర్ పెడుతున్న ఈ ప్రిన్సిపల్ మాకొద్దంటూ.. విద్యార్థినులు ఉదయం ఎనిమిది గంటలకు ఒక్కసారిగా మార్కెట్ ఏరియాలోని రోడ్లపై పరుగులు పెట్టారు. దీంతో ఏం జరుగుతోందో అర్థం కాక స్థానికులు హడలెత్తిపోయారు.

ఇక వారందరూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. అక్కడ దాదాపుగా గంట పాటు ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థినులను నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

మాకొద్దీ ప్రిన్సిపల్..!

అయితే టార్చర్ పెడుతున్న ప్రిన్సిపాల్ పై యాక్షన్ తీసుకోవాలని విద్యార్థినులు పట్టుబట్టి రోడ్డుపైనే కూర్చున్నారు. తరువాత అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికెళ్లి అక్కడ బైఠాయించారు. ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి టిఫిన్ కూడా తినకుండా ఎండలోనే రోడ్డు పై కూర్చున్నారు.

హాస్టల్ ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని.. భోజనం కూడా మెను ప్రకారంగా పెట్టడం లేదని విద్యార్థినులు వా పోయారు. అనారోగ్యంతో విద్యార్థినులు బాధపడుతున్నా.. ఆమె పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని.. కనీసం ఇంటికైనా పంపించమంటే పంపించకుండా టార్చర్ పెడుతుందని వారు ఆరోపించారు. వారంలో శుక్రవారం నుంచి మంగళవారం వరకు ప్రిన్సిపల్ హాస్టల్ కే రావడం లేదని.. ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి.. సంగారెడ్డిలో పులి సంచారం.. ఆవు మెడను కొరికి చంపిన పులి!

https://rtvlive.com/tiger-roaming-in-sangareddy-the-tiger-bit-the-cows-neck-and-killed-it/

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe