Hands Pack: ఈ ప్యాక్‌తో చేతులు, కాళ్లలో మురికిపోవడం ఖాయం వేసవిలో సూర్యకాంతితోపాటు దుమ్ము, కాలుష్యం ఎక్కువ. బయటకు వెళ్తే పాదాలు చాలా మురికిగా మారుతాయి. చేతులు, కాళ్ళలో నలుపు కనిపిస్తే ఇంట్లో చేసిన ప్యాక్‌తో శుభ్రం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ ప్యాక్‌ను ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 19 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Hands Pack: దుమ్ము, కాలుష్యం, సూర్యకాంతి కారణంగా చేతులు, కాళ్ళు తరచుగా నల్లగా కనిపిస్తాయి. ఇది శుభ్రం చేయడం కష్టంగా అనిపిస్తుంది. చేతులు, కాళ్ళలో నలుపు కనిపించడం ప్రారంభిస్తే ఇంట్లో తయారు చేసిన ప్యాక్‌తో వాటిని శుభ్రం చేసుకోవచ్చు. వేసవిలో సూర్యకాంతి మాత్రమే కాకుండా దుమ్ము, కాలుష్యం కూడా ఎక్కువ. దీని వల్ల ఇంటి నుంచి బయటకు వెళ్తే పాదాలు చాలా మురికిగా మారుతాయి. ప్రతీసారి పెడిక్యూర్ చేయడం కష్టం. అటువంటి పరిస్థితిలో ఇంట్లో ఈ ప్యాక్ సహాయంతో పాదాలు, చేతులలోని మురికిని శుభ్రపరచవచ్చు. చర్మాన్ని మెరిసేలా చేయవచ్చు. రెండు చెంచాల గోధుమ పిండి, అర చెంచా ఈనో, ఒక చెంచా నిమ్మరసం తీసుకోవాలి. ముందుగా ఒక గ్లాసు గిన్నెలో అర టీస్పూన్ ఈనో పొడిని తీసుకోవాలి. అందులో కొంచెం వేడినీరు కలపండి. ఇప్పుడు ఈ ద్రావణంలో రెండు మూడు చెంచాల గోధుమ పిండిని కలపండి. దానికి ఒక నిమ్మకాయ రసంతో బాగా కలపాలి. ఈ ప్యాక్‌ను చేతులు, కాళ్లు, మెడపై అప్లై చేయాలి. ముఖానికి మాత్రం వాడకూడదు. తేలికపాటి మసాజ్ చేయండి. పది నుంచి ఇరవై నిమిషాలు వదిలేయండి. తర్వాత నీటితో కడగాలి. చర్మంపై నలుపు ఎక్కువగా ఉంటే వారానికి రెండు, మూడు సార్లు రాసుకోవచ్చు. నిమ్మకాయలో సహజమైన బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి. ఇది చర్మంపై పేరుకుపోయిన మురికిని పూర్తిగా శుభ్రపరుస్తుంది. గోధుమలు సహజమైన స్క్రబ్. ఇది చర్మంపై పేరుకుపోయిన మురికి, డెడ్ స్కిన్‌ను తొలగిస్తుంది. ఇది కూడా చదవండి: వేసవి తాపం వల్ల గుండెపోటు వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారు? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #hands-pack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి