కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినట్లయితే...స్కామ్స్, అవినీతికి అడ్డూ అదుపు అనేదే ఉండదన్నారు. అదే మోడీ మళ్లీ అధికారంలోకి వచ్చినట్లయితే మోసగాళ్లకు చెక్ పెడతారన్నారు. దీంతోపాటు రాజస్థాన్ లో గెహ్లాట్ సర్కార్ అవినీతిలో నెంబర్ వన్ గా ఉందని అమిత్ షా ఆరోపించారు.
రాజస్థాన్ లో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. దీంతోపాటు మోడీ మరోసారి దేశానికి ప్రధాని అవుతారంటూ ధీమా వ్యక్తం చేశారు. లోకసభ ఎన్నికల్లో తాము 300ల సీట్లు గెలుస్తామన్నారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో కేంద్రం సాధించిన విజయాలను వివరిస్తూ...9ఏళ్ల కాలంలో భారతదేశంలో ఎన్నో విధివిధానాలను మార్చామని..పలు రంగం కూడా ప్రగతి పథంలో దూసుకుపోతుందని తెలిపారు.
అటు సోనియా, లాలూ ప్రసాద్ యాదవ్ లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు అమిత్ షా. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే సోనియాగాంధీ ముందున్న ప్రధాన లక్ష్యమని..తేజస్వీ యాదవ్ ను సీఎం చేయడమే లాలాూ లక్ష్యమన్నారు. మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ ను సీఎం చేయాలని, అశోక్ గెహ్లాట్ తన కుమారుడు వైభవ్ ను సీఎం చేయాలని అనుకుంటున్నారంటూ విమర్శించారు.
ఇక గెహ్లాట్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పలు విమర్శలు చేశారు అమిత్ షా. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని..కన్హయ్యలాల్ హత్య కేసులో దోషులకు శిక్ష ఆలస్యం కావడానికి కాంగ్రెస్ కారణమంటూ ఆరోపణలు చేశారు. గతేడాది జూన్ 28న కన్హయ్య లాల్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. నూపురు శర్మకు మద్దతుగా ఆయన చేసిన పోస్టుతో మతోన్మాది అతన్ని దారుణంగా హత్య చేశారు.
అటు గెహ్లాట్ సర్కార్ అవినీతికి పాల్పడిందంటూ...రాజస్తాన్ లో కాంగ్రెస్ అవినీతి రికార్డులన్నింటిని బద్దలు కొట్టిందని ఆరోపించారు. గెహ్లాట్ సర్కార్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందంటూ అమిత్ షా ఎదురుదాడికి దిగారు. 19కి పైగా రిక్రూట్ మెంట్ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని..రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి కుమారుడు పరీక్షల్లో టాపర్ గా నిలవడానికి అదే కారణమని విమర్శలు చేశారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయితే జరిగేది ఇదే: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..!!
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా. ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినట్లయితే స్కామ్ లు, అవినీతికి భారత్ తలమానికంగా మారుతుందని...మోడీ అధికారంలోకి వస్తే మోసగాళ్ల కటకటాలపాలవుతారని అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో కేంద్ర సర్కార్ సాధించిన విజయాలను వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ 9ఏళ్ల భారతదేశంలో అనేకు విధివిధానాలు మారాయన్న అమిత్ షా..పలు రంగాల్లో భారత్ ప్రగతి పథంలో దూసుకుపోతుందని తెలిపారు.