కాళ్లు కడగడం వెనుక అసలు కథ ఇదేనా..? మండిపోతున్న విపక్షాలు..!!

గిరిజన వ్యక్తిపై బీజేపీకి చెందిన నేత మూత్రం పోయడంతో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ టార్గెట్‌గా కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తుండడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. బాధితుడు అయిన దశరత్ రావత్​ ను స్వయంగా తన ఇంటికి ఆహ్వానించారు. నట్టింట్లో.. పెద్ద కుర్చీ వేసి కూర్చోబెట్టారు. సీఎం చౌహాన్ కింద కూర్చుని.. బాధితుడి కాళ్లు కడిగారు. నీళ్లు నెత్తిన చల్లుకున్నారు.

New Update
కాళ్లు కడగడం వెనుక అసలు కథ ఇదేనా..? మండిపోతున్న విపక్షాలు..!!

మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. 2018లో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 230స్థానాలకు 114స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. 109స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 116స్థానాలు ఏ ఒక్కరికి రాకపోవడంతో ఇతరుల మద్దతులో కాంగ్రెస్‌ కూటమిగా ఏర్పడి మెజార్టీ మార్క్‌ని దాటింది. ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ ప్రమాణస్వీకారం చేశారు. సరిగ్గా సంవత్సరం కాలం పాలించారో లేదో.. మెజార్టీ కోల్పోవడం.. బీజేపీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి.

publive-image

కాంగ్రెస్‌కి చెందిన 22మంది ఎమ్మెల్యేలు రెబెల్స్‌గా మారి తమ పదవులకు రాజీనామా చేయడంతో సీఎంగా శివరాజ్ సింగ్ చౌహన్‌కి లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఇక ఈసారి కూడా ఎన్నికలు చావోరేవో జరుగుతాయని అంతా భావిస్తున్న సమయంలో బీజేపీకి ట్రైబల్స్‌ ఓట్ల టెన్షన్ పట్టుకుంది. 2018ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిపోయిన బీజేపీ..తాజాగా ఆదివాసీ గిరిజనుడిపై బీజేపీకి చెందిన ప్రవేశ్​ శుక్లా మూత్రం పోసిన ఘటనతో ఇబ్బందులో పడింది. కాంగ్రెస్‌ నుంచి తీవ్ర విమర్శలు రావడంతో దిద్దుపాటు చర్యలకు దిగిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితుడి కాళ్లు కడిగారు. అయితే ఇదంతా ఎన్నికల్లో ట్రైబల్స్‌ ఓట్ల కోసమంటూ కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగింది.

మధ్యప్రదేశ్‌లో గిరిజనులు అధికంగా ఉన్న 84 నియోజకవర్గాల్లో 2018లో బీజేపీ కేవలం 34 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 2013లో 59స్థానాల్లో గెలిచింది. అయితే 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత కొన్ని నెలలుగా చౌహాన్‌తోపాటు ముఖ్యమైన బీజేపీ నాయకులు గిరిజనులను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గిరిజన కుటుంబాలకు ఇళ్లకే ప్రజా పంపిణీ, రేషణ్ అందించే ఆప్కే ద్వార్ అనే కొత్త పథకాన్ని కూడా ప్రటించింది. అంతేకాదు రాష్ట్రంలోని గిరిజనులకు కమ్యూనిటీ అడవులను నిర్వహించే హక్కును కల్పిస్తామని, దాని కింద వారు అడవిని సృష్టించి, దాని నుండి వచ్చే పండ్లు, కలప వంటి వివిధ రకాల ఉత్పత్తులపై ప్రత్యేక హక్కులు కలిగి ఉంటారని చౌహాన్ ప్రకటించారు.ఇటువంటి ఎత్తుగడలతో బీజేపీ రానున్న ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉన్న గిరిజన ఓట్లను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు మండిపడ్డాయి.

అయితే తాజాగా మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాకు చెందిన బాధితుడు దశ్ మత్ రావత్ శివరాజ్ సింగ్ చౌహన్ కాళ్లు కడిగిన ఘటనపై విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదంతా ఎన్నికల కోసమే అంటూ దుమ్మేత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ...ఈ ఘటనను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సీఎం కాళ్లు కడిగారంటూ మండిపడుతున్నారు. కేవలం కాళ్లు కడిగితే సరిపోతుందా అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గిరిజనుల బాగోగుల గురించి ఏనాడూ పట్టించుకోని చౌహాన్ సర్కార్...గిరిజనుడిపై మూత్ర విసర్జన ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇంతకు ముందు గిరిజనులపై ఎన్నో ఘటనలు జరిగినప్పుడు కనీసం స్పందించని ముఖ్యమంత్రి ఇప్పుడు ఇంటికి పిలుచుకుని కాళ్లు కడగడం వెనకున్న ఆంతర్యం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పనులు చేయడం వల్ల గిరిజనుల ఓటు బ్యాంకు దగ్గరవుతుందన్న కారణంతోనే కాళ్లు కడిగారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు