megaplex: సౌత్ లో తొలి మెగాప్లెక్స్ ఇదే!

సౌత్ లో తొలి మెగా ప్లెక్స్ ఇదే. ఈ కంపెనీ కర్ణాటక వ్యాప్తంగా 219 స్క్రీన్‌లని కలిగి వుంది .సౌతిండియాలో 100 ప్రాపర్టీల్లో మొత్తం 572 స్క్రీన్‌లతో ఉనికిని చాటుకుంటోంది. ఇప్పుడు ఈ మెగా ప్లెక్స్ కంపెనీ పైనే దేశం మొత్తం చూస్తుంది.

New Update
megaplex: సౌత్ లో తొలి మెగాప్లెక్స్ ఇదే!

మెగా బడ్జెట్లతో భారీ పానిండియా సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సృష్టిస్తున్నాయి. మరి నిర్మాణ రంగంలో ఈ ఘనత సాధిస్తున్నప్పుడు థియేటర్ల పరంగా సాధిస్తున్న అభివృద్ధి ఏమిటి? మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ వంటి కొందరు స్టార్లు మల్టీప్లెక్సుల రంగంలో ప్రవేశించి ఆధునిక థియేటర్లని నిలబెడుతున్నారు. అయితే పూర్తిగా ప్రదర్శనా రంగంలో మార్కెట్ ని విస్తరించుకుంటున్న పీవీఆర్- ఐనాక్స్ మల్టీప్లెక్స్ గ్రూపు సౌత్ వైపు కదిలి అనేక థియేటర్లని ప్రారంభించింది. ఇటీవల కేరళలోని కోచిలో 9 స్క్రీన్లతో ఒక పెద్ద మల్టీప్లెక్స్ ని ప్రారంభించింది. ఇదిలా వుండగా, వెంటనే గత వారం బెంగుళూరులో 14 స్క్రీన్లతో సౌత్ లోనే పెద్దదైన మెగాప్లెక్స్ కి ప్రారంభోత్సవం చేసింది.

ఐనాక్స్ బెంగళూరు నగరంలోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో 14 స్క్రీన్లతో మెగాప్లెక్స్ ని ప్రారంభించింది. ఇందులో మూడు ప్రీమియం ఫార్మాట్‌లైన ఎంఎక్స్ 4డీ, స్క్రీన్ ఎక్స్, ఇన్‌సిగ్నియా లని ఏర్పాటు చేసింది. దక్షిణ దేశంలో మొదటి ఎంఎక్స్ 4డీ అనే త్రీడీని మించిన 4డీ ప్రదర్శనతో అద్భుత అనుభవాన్ని అందిస్తోంది. అలాగే స్క్రీన్ ఎక్స్ టెక్నాలజీతో దక్షిణాన తొలి 270-డిగ్రీల సినిమా ప్రదర్శనని పరిచయం చేస్తోంది.ఈ మెగా ప్లెక్స్ తో కంపెనీ బెంగుళూరులో 26 సినిమాల్లో 172 స్క్రీన్‌లని, కర్ణాటక వ్యాప్తంగా 37 సినిమాల్లో 219 స్క్రీన్‌లని కలిగి వుంది. సంస్థ సౌతిండియాలో 100 ప్రాపర్టీల్లో మొత్తం 572 స్క్రీన్‌లతో ఉనికిని చాటుకుంటోంది. స్థిరమైన ప్రాంతీయ కంటెంట్ సరఫరాతో, వినియోగదారుల పెరుగుతున్న డిమాండ్‌తో దక్షిణ ప్రాంతం కంపెనీకి కీలకమైన మార్కెట్ గా మారింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రీమియం స్క్రీన్ ఫార్మాట్‌లకి అద్భుతమైన స్పందనని కంపెనీ అందుకుంది. 3 ప్రీమియం సినిమా ఫార్మాట్‌లు ఎంఎక్స్ 4డీ, స్క్రీన్ ఎక్స్, ఇన్‌సిగ్నియా సహా 14 స్క్రీన్‌లతో దక్షిణాదిలో అతిపెద్ద సినిమా మెగాప్లెక్స్ గా బెంగుళూరులో వెలసింది.

కేరళలోని కోచి నగరంలో ఫోరమ్ మాల్‌లో 9 స్క్రీన్ల మల్టీప్లెక్స్ లో అత్యాధునిక 4కే లేజర్ ప్రొజెక్టర్లు, డాల్బీ అట్మాస్ సౌండ్, రియల్ డీ3డీ టెక్నాలజీలు సమకూర్చారు. బెంగళూరు మెగాప్లెక్స్ లాంచ్‌తో పీవీఆర్ -ఐనాక్స్ ఇప్పుడు 113 నగరాల్లో (శ్రీలంక సహా) 361 ప్రాపర్టీల్లో మొత్తం 1,741 స్క్రీన్‌లతో అతిపెద్ద మల్టీప్లెక్స్ నెట్వర్క్ ని నిర్వహిస్తోంది. కంపెనీ సినిమా ప్రదర్శనలో, ప్రొడక్షన్ వ్యాపారంలో నిమగ్నమై దేశం అంతటా అతిపెద్ద సినిమా సర్క్యూట్‌ని ను నిర్వహిస్తోంది. సినిమా టిక్కెట్ల విక్రయం, సినిమా ప్రకటనలు, ఆహార పానీయాల విక్రయం, రెస్టారెంట్ వ్యాపారం మొదలైన వాటి ద్వారా కంపెనీ ఆదాయాన్ని పొందుతోంది. ఈ మెగాప్లెక్స్ తో బెంగళూరు సినిమా ప్రేక్షకులు అద్భుతమైన అనుభవాన్ని పొందుతారు. ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియా ఇప్పుడు దక్షిణ దేశంలో సినిమాలు చూసే అనుభవాన్ని సరికొత్త స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇది 1,997 మంది ప్రేక్షకులు కూర్చోగల సీటింగ్ కెపాసిటీతో వుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు