సరిహద్దు వివాదం పాక్ లో 36 మంది ప్రాణాలు తీసింది!

పాక్ లో ఓ స్థలం వివాదంలో 36 మంది మరణించగా..160 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పర్ కుర్రం జిల్లా బోసెర గ్రామంలో గత 5  రోజులుగా కొండవాలు స్థల ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణలో పదుల సంఖ్యలో మరణించినట్టు అక్కడి అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

సరిహద్దు వివాదం పాక్ లో 36 మంది ప్రాణాలు తీసింది!
New Update

పాకిస్థాన్‌లోని ఓ స్థలం వివాదంలో 36 మంది ప్రాణాలు పోగా.. 160 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్ఘాన్ సరిహద్దులోని ఖైబర్ ఫఖ్తున్ ఖ్వాలోని అప్పర్ కుర్రం జిల్లా బోసెర గ్రామంలో గత 5  రోజులుగా కొండవాలు స్థల వివాదం ఘర్షణలు జరుగుతున్నాయి. ఇవి గిరిజనులు,మత సమూహాల మధ్య చోటు చేసుకున్నాయి. ఇరువర్గాల మధ్య ఇప్పటి వరకు జరిగిన ఘర్షణలో 36 మంది మరణించగా 160 మంది గాయపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు.ఇప్పటికే శాంతి భద్రతలను అదుపులోకి తీసుకువచ్చాయని ఆయన తెలిపారు.

#pakistan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe