/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/sleep-disorder-jpg.webp)
Sleep Anxiety: మార్నింగ్ నిద్రలేచిన దగ్గర నుంచి నైట్ బెడ్ ఎక్కేవరకు చాలా మంది చాలా ప్రశాంతంగా కనిపిస్తారు.. కానీ బెడ్ ఎక్కిన తర్వాత నిమిషమే వారిలో తెలియని ఆందోళన మొదలవుతుంది. కొంచెం భయం భయంగా.. మనకి ఏదో జరుగుతున్నట్టు టెన్షన్ టెన్షన్‌గా అనిపిస్తుంటుంది. ఓవర్ థింకింగ్ అవహించే సమయం అది. ఆ రోజు జరిగిన విషయాలపై ఆందోళన.. రేపు ఏం జరగబోతుందోనన్న ఫీలింగ్‌తో నిద్రపట్టదు. ఇది చాలా రోజులు కంటిన్యూ అవుతూనే ఉంటే మీరు స్లీప్ ఎంగ్జైటీతో బాధపడుతున్నట్టే లెక్క! ఆందోళన, ఒత్తిడి నిద్రపోనివ్వకుండా ఆపుతాయి. ఆందోళన కలిగి ఉండటం నిద్ర సమస్యలను కలిగిస్తుంది.. నిద్ర లేమి కూడా ఆందోళనను రేకెత్తిస్తుంది. మీకు నిద్ర పట్టకపోతే, మీరు పడుకోవడానికి, మేల్కొనడానికి భయపడవచ్చు.
స్లీప్ ఎంగ్జైటీ లక్షణాలు:
➼ నిద్రపోవడంలో ఇబ్బంది
➼ ఏకాగ్రతలో ఇబ్బంది
➼ ఆందోళన
➼ జీర్ణశయాంతర సమస్యలు
➼ పీడకలలు
➼ రాత్రి భయాలు
సాధారణ ప్రభావాలు:
➼ మీ మానసిక స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది
➼ పని లేదా స్కూలు వద్ద పేలవమైన పనితీరుకు దారితీస్తుంది.
➼ ఏ విషయంపై శ్రద్ద పెట్టలేం
➼ డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచుతుంది.
➼ నిద్రవేళలో ఆందోళనను ఎలా అధిగమించాలి:
➼ బెడ్ టైమ్‌కి ముందు స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి
➼ నిద్రవేళకు దగ్గరగా భారీగా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేయవద్దు
➼ ఓవర్‌గా భోజనం చేయవద్దు
➼ నిద్రవేళ సమయంలో కెఫిన్ లేదా ఆల్కహాల్ తీసుకోకూడదు
➼ బరువున్న దుప్పటిని ఉపయోగించండి
➼ బరువున్న దుప్పట్లు కార్టిసాల్‌ని తగ్గించేటప్పుడు సెరోటోనిన్, మెలటోనిన్ పెంచడానికి సహాయపడతాయి. అందుకే అవి ప్రశాంతత ప్రోత్సహిస్తాయి.
వేగవంతమైన ఆలోచనా విధానాలను మానుకోండి. ఏ విషయంలోనూ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు. స్కూల్, కాలేజీ లేదా ఆఫీస్ విషయాలను బెడ్ ఎక్కిన తర్వాత ఆలోచించవద్దు. మెడిటేషన్ లాంటివి అలవాటు చేసుకోండి. మంచి మ్యూజిక్ వినండి. ఓవర్ థింకింగ్ అసలు వద్దు. స్లీప్ ఎంగ్జైటీ సమస్యతో మీరు బాధపడుతున్నరని మీకు అర్థమైతే లేట్ చేయకుండా మెడికల్ ప్రొఫెషనల్‌ని సంప్రదించండి.
ALSO READ: నిరుద్యోగులకు అలర్ట్.. 342 పోస్టులకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి!