Free Wifi: విమానాల్లో ఫ్రీ వైఫై..ఏ ఎయిర్‌ లైన్స్‌ లోనో తెలుసా!

విస్తారా ఎయిర్‌లైన్స్‌ తన విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకొంది. అంతర్జాతీయ ప్రయాణ సమయంలో తొలి 20 నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలను అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Free Wifi: విమానాల్లో ఫ్రీ వైఫై..ఏ ఎయిర్‌ లైన్స్‌ లోనో తెలుసా!
New Update

Vistara Airlines: విస్తారా ఎయిర్‌లైన్స్‌ తన విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకొంది. అంతర్జాతీయ ప్రయాణ సమయంలో తొలి 20 నిమిషాల పాటు ఉచిత వైఫై (Free WIFI) సేవలను అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టాటా -సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ ఎయిర్‌లైన్స్ అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేవారికి 20 నిమిషాల ఉచిత వై-ఫైని అందించనున్నట్లు పేర్కొంది.

విస్తారా అనేది టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఎయిర్‌లైన్ 53 ఎయిర్‌బస్ A320neo, 10 Airbus A321neo, 7 బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానాలతో సహా 70 విమానాల్లో ఈ సదుపాయం కల్పించనున్నట్లు సమాచారం.

20 నిమిషాల పాటు వైఫై యాక్సెస్ అన్ని క్యాబిన్‌లలోని ప్రయాణీకులను కనెక్ట్ చేయడానికి అనుమతి ఇవ్వనుంది. అనంతరం భారతీయ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి వైఫైనే మరింత పొడిగించుకోవచ్చు. ప్లాన్‌లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనువైనదని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో ఈ సేవలను తీసుకొచ్చామని, ప్రయాణికులు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నామని విస్తారా ప్రతినిధులు తెలిపారు.

Also Read: తెలంగాణలో మరో రెండు రోజులు వానలే..వానలు!

#vistara #vistara-air-lines #wifi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe