Free Wifi: విమానాల్లో ఫ్రీ వైఫై..ఏ ఎయిర్ లైన్స్ లోనో తెలుసా! విస్తారా ఎయిర్‌లైన్స్ తన విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకొంది. అంతర్జాతీయ ప్రయాణ సమయంలో తొలి 20 నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలను అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By Bhavana 28 Jul 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Vistara Airlines: విస్తారా ఎయిర్‌లైన్స్ తన విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకొంది. అంతర్జాతీయ ప్రయాణ సమయంలో తొలి 20 నిమిషాల పాటు ఉచిత వైఫై (Free WIFI) సేవలను అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టాటా -సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ ఎయిర్‌లైన్స్ అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేవారికి 20 నిమిషాల ఉచిత వై-ఫైని అందించనున్నట్లు పేర్కొంది. విస్తారా అనేది టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఎయిర్‌లైన్ 53 ఎయిర్‌బస్ A320neo, 10 Airbus A321neo, 7 బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానాలతో సహా 70 విమానాల్లో ఈ సదుపాయం కల్పించనున్నట్లు సమాచారం. 20 నిమిషాల పాటు వైఫై యాక్సెస్ అన్ని క్యాబిన్‌లలోని ప్రయాణీకులను కనెక్ట్ చేయడానికి అనుమతి ఇవ్వనుంది. అనంతరం భారతీయ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి వైఫైనే మరింత పొడిగించుకోవచ్చు. ప్లాన్‌లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనువైనదని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో ఈ సేవలను తీసుకొచ్చామని, ప్రయాణికులు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నామని విస్తారా ప్రతినిధులు తెలిపారు. Also Read: తెలంగాణలో మరో రెండు రోజులు వానలే..వానలు! #vistara #vistara-air-lines #wifi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి