Airport: ఏప్రిల్ 21న 5 గంటల పాటు ఎయిర్‌పోర్ట్ బంద్..!

తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ నెల 21న సా. 4 నుండి రాత్రి 9 వరకు విమానాల రాకపోకలపై నిషేధం ఉంటుంది. విమానాశ్రయం గుండా ఆలయ దేవతల ఊరేగింపు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు TIAL తెలిపింది.

Airport: ఏప్రిల్ 21న 5 గంటల పాటు ఎయిర్‌పోర్ట్ బంద్..!
New Update

Thiruvananthapuram: కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏప్రిల్ 21 ఆదివారం రోజున సా. 4 గంటల నుండి రాత్రి 9 వరకు విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. ఈ విషయాన్ని తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (TIAL) వెల్లడించింది.

Also Read: విద్యార్థులకు శుభవార్త.. వేసవి సెలవులు వచ్చేశాయ్..

శ్రీ పద్మనాభస్వామి ఆలయం నుంచి బయలుదేరే పెంకుని ఆరట్టు ఊరేగింపు తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్ గుండా వెళుతుందని, ఈ సమయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఐదు గంటల పాటు విమాన సర్వీసును నిలిపివేయాలని నిర్ణయించినట్లు TIAL వెల్లడించింది. ఏడాదికి రెండు సార్లు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలా జరుగుతుందని తెలిపింది.

Also Read: లక్ష్యం ముందు..పేదరికం చిన్నది..సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన బీడీ కార్మికురాలి బిడ్డ..!

సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఆలయ దేవతల ఊరేగింపు ఈ విమానాశ్రయం గుండా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఊరేగింపులో భాగంగా విమానాశ్రయం వెనకాల ఉన్న సముద్రంలో విగ్రహాల ఉత్సవ స్నానం చేసి తరువాత సాంప్రదాయ జ్యోతుల ద్వారా వెలిగించిన ఊరేగింపులో విగ్రహాలను తిరిగి మందిరానికి తీసుకువెళతారని తెలుస్తోంది.

#airport #thiruvananthapuram
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe