
మణిపూర్(manipur)లో ముగ్గురు మహిళలను వివస్త్రలుగా మార్చి ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ముగ్గురు మహిళలను బట్టలు లేకుండా ఊరేగించి..తర్వాత అందులో ఓ యువతిని సామూహికంగా అత్యాచారం చేశారన్న వార్త బయటకు వచ్చిన తర్వాత నుంచి దేశంలో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు బాధిత మహిళలు అనుభవించిన నరకం గురించి తలచుకుంటూ సమాజం కన్నీరుపెడుతోంది. ఆ సమయంలో వాళ్ల పడ్డ నరకయాతన అంతాఇంతా కాదు.. చుట్టూ మగాళ్లు..ఊరంతా చూస్తుండగా..తాక కూడని చోటా తాకుతూ..తమ శరీరాలని బొమ్మలా ఆడుకుంటూ, వాడుకుంటూ అత్యంత పైశాచికంగా ప్రవర్తించడం చూస్తే మనసు మెలిపెడుతోంది. ఈ ఉదంతం గురించి వింటుంటేనే ఇలా ఉంటే.. అనుభవించిన వారి బాధ ఎలా ఉంటుందన్నది ఆలోచిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. బాధిత మహిళల్లో ఒకరి తల్లి(mother) తన ఆవేదనను ప్రపంచంతో పంచుకుంది. పలకరించగానే కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉన్న ఆమె…లోపల నుంచి వస్తున్న ఉద్వేగాన్ని ఆపుకుని ఆ రోజు జరిగిన విషాదాన్ని కళ్లకు కట్టింది.
పూర్తిగా చదవండి..