ప్రపంచ క్రికెట్లో రోహిత్,విరాట్ తర్వాతే ఎవరైనా..జయసూర్య!

కోహ్లీ,రోహిత్ శర్మల పై శ్రీలంక కోచ్ జయసూర్య ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలో ఏ క్రికెట్ ఆటగాడైన వీరిద్దరి తర్వాతనే అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం క్రికెట్ ను ఈ జోడీ ఏలుతుందని జయసూర్య కొనియాడాడు. టీ20, వన్డే సిరీస్ ప్రారంభం ముందు జయసూర్య కామెంట్స్ ఆసక్తిగా మారాయి.

New Update
ప్రపంచ క్రికెట్లో రోహిత్,విరాట్ తర్వాతే ఎవరైనా..జయసూర్య!

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొనేందుకు భారత జట్టు శ్రీలంకకు వెళ్లింది. జూలై 27, 28, 30 తేదీల్లో పల్లెకెలె స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. రోహిత్ శర్మ, కోహ్లి, జడేజా రిటైరవ్వడంతో కొత్త కెప్టెన్ సూర్యకుమార్, కొత్త కోచ్ గంభీర్ సారధ్యంలో భారత 'టీ20' జట్టు రంగంలోకి దిగింది.

తాజాగా శ్రీలంక దిగ్గజ క్రికెటర్, తాత్కాలిక హెడ్ కోచ్ సనత్ జయసూర్య విరాట్, రోహిత్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ప్రపంచ క్రికెట్ లో వారిద్దర తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం క్రికెట్ ను ఈ జోడీ ఏలుతుందని జయసూర్య కొనియాడాడు. మరికొద్ది రోజుల్లో శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో జయసూర్య ఈ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు