క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ఎవరికైనా, ఏ వయసు వారికైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్ కారణంగా ప్రతి ఏటా మిలియన్ల మంది మరణిస్తున్నారు. ప్రపంచంలో చోటు చేసుకుంటున్న మరణాల్లో క్యాన్సర్ రెండవ ప్రధాన కారణం.ఎలాంటి ప్రత్యేక కసరత్తులు చేయకుండానే 5 కేజీలకుపైగా బరువు తగ్గితే.. దాన్ని క్యాన్సర్కు తొలి సూచికగా భావించవచ్చని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ, మెడికల్ ఆంకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ మీనూ వాలియా తెలిపారు. క్లోమం, ఆహార నాళం, ఉదర, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్లలో ఇది ప్రాథమిక లక్షణమని ఆయన తెలిపారు. పేగుల్లో ఉండే కణుతుల కారణంగా కొద్ది మోతాదులో ఆహారం తీసుకోగానే కడుపు నిండినట్లు అవుతుందని ఆయన తెలిపారు.
పూర్తిగా చదవండి..భారత్ లో ప్రమాదకరమైన 7 క్యాన్సర్లు!
భారత్ లో అత్యధికంగా ఏడు రకాల క్యాన్సర్లు ఉన్నాయని ICFMR నివేదిక పేర్కొంది. ఊపిరితిత్తులు, రొమ్ము,అన్నవాహిక, నోరు, కడుపు, లివర్, గర్భాశయం క్యాన్సర్ ఎక్కువగా పీడిస్తున్నాయని.. పురుషుల కంటే మహిళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కూడా ఈ నివేదికలో వెల్లడైంది.
Translate this News: