ఈ ఆరు రాశుల వారు చాలా మొండివాళ్లట...తమ తప్పులను అస్సలు ఒప్పుకోరట...అందులో మీరున్నారేమో చూసుకోండి...!! కొంతమంది రాశిచక్ర వ్యక్తులు తమ తప్పులను అస్సలు ఒప్పుకోరు. మేషం, వృషభం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు ఈ రాశుల వారు చాలా మొండిగా ప్రవర్తిస్తారట. అంతేకాదు తమ తప్పులను ఎత్తిచూపే వారిని కూడా తప్పు పట్టగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. By Bhoomi 27 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కోరాశికి ఒక్కోలా గుణదోషాలు ఉంటాయి. జ్యోతిష్య దృక్కోణంలో ఆరు రాశిచక్ర గుర్తులు ఉన్నాయి. వాటితో సంబంధం ఉన్న వ్యక్తులు తమ తప్పును ఎప్పుడూ ఒప్పుకోరు. ఆ ఆరు రాశులేంటో చూద్దాం మేషం : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి వారు చాలా ఆకర్షణీయంగా ఉ:టారు. మేషరాశివారికి విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఈ రాశితో సంబంధం ఉన్న వ్యక్తులు చాలా నమ్మకంగా ఉంటారు. తమ తప్పులు ఒప్పుకోరు. ఇతరుల ముందు సిగ్గుపడుతుంటారు. వృషభం : ఈ రాశివారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఎఫ్పుడు ఎవరితో మాట్లాడతారో...ఎప్పుడు మానేస్తారో తెలియదు. తప్పు చేసినా ఒప్పుకునేందుకు చాలా ఆలోచిస్తారు. తమ తప్పులను ఎత్తి చూపేవారిని కూడా తప్పు పట్టే కెపాసిటి వీరిలో ఉంటుంది. సింహం: ఈ రాశివారికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఇతరుల ముందు తలవంచడం ఇష్టం ఉండదు. తాము తప్పు చేసినా ఇతరుల ముందు తలవంచరు. కన్య: ఈ రాశి వారు కూడా సింహరాశి వలే ఆత్మ గౌరవంతో ఉంటారు. ఎదుటివారు సరైనవారని భావించినప్పుడే తప్పును అంగీకరిస్తారు. వారి ఆత్మగౌరవ స్వభావం వల్లే గొప్ప విజయాలను సాధిస్తారు. వృశ్చికం: ఈ రాశి వారికి పిరికి ఎక్కువ. కానీ చాలా తెలివైనవారు. వారికి నచ్చని వ్యక్తులకు దూరంగా ఉంటారు. తప్పును ఒప్పుకునే బదులు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. ధనుస్సు: ఈ రాశివారు పూర్తిగా స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడుతారు. ఇతరుల ముందు తలవంచరు. ఇంట్లో తులసి మొక్క ఎండిపోతుందా.. దానికి కారణమేంటో తెలుసా..! ప్రతీ ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉండడం సహజం. హిందూ సాంప్రదాయాల్లో తులసి మొక్కను లక్ష్మిదేవిగా భావిస్తారు. ఇంట్లోని ఆడవాళ్ళూ ప్రతీ రోజూ తులసి పూజ చేసుకుంటారు. పూజించడమే కాదు మొక్కను ఆరోగ్యంగా ఉంచడానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. కానీ చలికాలంలో తులసి మొక్కను రక్షించడం చాలా కష్టమైన పని. ఉష్ణోగ్రతలోని మార్పులు ఈ మొక్క చాలా ప్రభావాన్ని చూపుతాయి. వింటర్ సీజన్ లో అధిక చలి, మంచు కారణంగా ఈ మొక్క ఆకులు రాలిపోయి.. మొక్క ఎండిపోతుంది. మీ ఇంట్లో కూడా ఇలాంటి సమస్య ఉంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి. మొక్కను ఇండోర్ లో పెట్టండి: వాతావరణంలో అధిక చలి, మంచు పెరిగినప్పుడు తులసి మొక్క ఆకులు రాలిపోయి.. మొక్క ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇలాంటి సమయంలో ఒక వేళ మొక్కను తొట్టిలో పెంచినట్లతే దానిని.. ఆరుబయట కాకుండా ఇంట్లో ఉంచడం మంచిది. నీళ్లు తక్కువగా పోయాలి: మొక్కకు నీళ్లు పొసే విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్క ఉన్న భాగంలో రెండు ఇంచుల వరకు నెల పొడిగా ఉంటేనే నీళ్లు పట్టాలి. ఎక్కువగా నీళ్లు పోయడం వల్ల వేర్లకు తెగుళ్లకు దారి తీస్తుంది. అంతే కాదు నీటి వల్ల ఆకులు ముడతపడడం, రాలిపోవడం జరుగుతుంది. సరైన మోతాదులో నీళ్లు పోస్తే సరిపోతుంది. సూర్యరశ్మిలో ఉంచండి: తులసి మొక్క ఆరోగ్యంగా ఉండడానికి సరైన సూర్యరశ్మిలో ఉంచడం తప్పనిసరి. రోజుకు కనీసం 6-7 గంటల పాటు మొక్కను సూర్య కాంతిలో ఉంచేలా చూసుకోవాలి. కొంత మంది ఇళ్లలో ఇంటి లోపల మొక్క ఉంటుంది. కావున మొక్కను పెంచేటప్పుడు సూర్యరశ్మి తగలడానికి వీలుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేపాకుల నీటిని పోయాలి: తులసి ఆకులు ఎండిపోకుండా ఉండడానికి మరో అద్భుతమైన చిట్కా వేపాకు నీళ్లు. ఎండిపోయిన వేపాకులను నీటిలో బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ వేపాకుల నీటిని తులసి మొక్కకు పోస్తే.. వాటి ఆకులు ఆరోగ్యంగా పచ్చగా ఉంటాయి. ఆకులను రెగ్యులర్ గా కత్తిరించాలి: తులసి మొక్క ఆరోగ్యంగా ఉండడానికి ఇది చాలా ముఖ్యం. మొక్కలో ఏదైనా తెగుళ్లు సోకిన భాగాన్ని కత్తిరించాలి. అలాగే మొక్కలో ఎండిపోయిన కొమ్మలను కూడా ఎప్పటికప్పుడు కత్తిరించాలి. ఇలా చేస్తే మొక్కలోని అన్ని భాగాలకు సూర్యరశ్మి తగిలి.. మొక్క పెరుగుదలకు ఉపయోగపడును. ఇది కూడా చదవండి: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగాలు..ఎలా అప్లై చేసుకోవాలంటే! #astrology #astrology-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి