భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు ప్రసిద్ధి. ఇక్కడ అనేక మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఒకటి ఒడిశాలోని పూరీ. దేశంలోని ఏడు మోక్షదాయకక్షేత్రాల్లో పూరీ జగన్నాథుడి ఆలయం ఒకటి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రథయాత్ర. ప్రపంచంలోని నలుమూల నుంచి ఈ యాత్రను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. సోదరుడు బలభ్రదుడు, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు ఈ ఆలయంలో కొలవయ్యారు.
పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరీ పుణ్యక్షేత్రానికి శ్రీ క్షేత్రం, శంఖక్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఏడాది పొడవునా గర్భాలయంలో కొలువుదీరి ఉండే జగన్నాథుడు రథయాత్ర జరిగే రోజున తన సోదరుడు, సోదరి తో కలిసి రథం అధిరోహిస్తాడు. ఇక్కడ స్వామివారికి నివేదించే వంటకాలను సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవి అదృశ్య పర్యవేక్షణలో తయారవుతాయని అందుకే ఆ వంటకాలకు అంత రుచి ఉంటుందని భక్తుల విశ్వాసం.
172 ఏళ్ల పురాతనమైన ఆలయంలో వంటగది ఎకరం స్థలంలో విస్తరించి ఉంటుంది. 32 విశాలమైన గదులు ఉన్నాయి. ఒక్కో వంటగది పొడవు 150 అడుగులు, వెడల్పు 100 అడుగులు ఉండగా ఎత్తు 20 అడుగులు ఉంటుంది. 500మంది వంటవాల్లు, 300మంది సహాయకులు నిరంతరం విధులు నిర్వర్తిస్తుంటారు. మట్టి కుండల్లో వంటకాలు తయారు చేస్తారు. ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా శ్రీ మహావిష్ణువు అర్థాంగి లక్ష్మీదేవి అద్రుశ్యంగా పర్యవేక్షిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
కాగా ఈ వంటగదికి ఆనుకుని రెండు బావులు ఉంటాయి. వాటిని గంగా, యమునా అని పిలుస్తుంటారు. ఆ బావుల్లో నుంచి వచ్చే నీటితో జగన్నాథుడికి భోగం తయారు అవుతుంది. అంతేకాదు రోజూకు కనీసం పది రకాల స్వీట్లు తయారు చేస్తారట. రోజుకు 70క్వింటాళ్ల బియ్యం వండుతారు. జగన్నాథుడికి ప్రతిరోజూ ఆరుసార్లు ప్రసాదం సమర్పిస్తారు. ఉదయం 4 నుంచి రాత్రి 8.30గంటల వరకు నైవేద్యం పెడతారు. నైవేద్యం కోసం 56 రకాల పదార్థాలను తయారు చేస్తారు.
పూరీలో ఈ వంటకాలు వెరీ వెరీ స్పెషల్ :
ఖాజా:
ఖాజా అనేది పూరీకి చెందిన ప్రసిద్ధ స్వీట్ . జగన్నాథ ఆలయంలో, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవికి ఖాజాను మహాప్రసాదంగా సమర్పిస్తారు.
దాల్మా:
దాల్మా అనేది ఒడిశా నుండి వచ్చిన సాంప్రదాయక వంటకం. ఇది పప్పు, కూరగాయల కలయిక. ఈ వంటకాన్ని నూనె లేకుండా తయారు చేస్తారు. ఈ వంటకం పూరీలో ప్రసిద్ధి చెందింది. రథయాత్ర సమయంలో జగన్నాథునికి నైవేద్యంగా పెడతారు. మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం అభ్యర్థన మేరకు ఈ వంటకాన్ని రాష్ట్రపతి డిన్నర్ మెనూలో చేర్చారు.
చేన పోదా:
మీరు పూరీని సందర్శిస్తున్నట్లయితే, చెనా పోడాను ప్రయత్నించడం మర్చిపోవద్దు. కాటేజ్ చీజ్, పంచదార, యాలకుల పొడి, బియ్యప్పిండి, డ్రై ఫ్రూట్స్, నెయ్యితో తయారు తయారు చేస్తారు.
రాస్బలి:
రస్బలి అనేది శ్రీ కృష్ణుని అన్నయ్య అయిన బలరాముడికి ప్రసాదంగా అందించబడే డీప్-ఫ్రైడ్ స్వీట్ డిష్. విశేషమేమిటంటే శ్రీకృష్ణుడికి సమర్పించే 56 భోగ్‌లలో ఈ వంటకం కూడా ఉంది.
పోదా పిఠం:
పౌరాణిక విశ్వాసాల ప్రకారం, జగన్నాథునికి ఇష్టమైన వంటకం పోడా పీఠం. ఇది బియ్యం పిండి, కొబ్బరి, నల్ల శనగ, బెల్లం, యాలకులతో తయారు చేస్తారు.