Aliv seeds Benefits: క్యాన్సర్‌ ముప్పు తగ్గాలంటే ఈ గింజలను రోజూ తినాలి

ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్‌ ఒకటి. ప్రతీ ఏటా లక్ష మంది క్యాన్సర్‌ ముప్పుతో మరణిస్తున్నారు. అయితే అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య పద్ధతులతో క్యాన్సర్‌ చికిత్స సులభం అయినా.. కొన్ని ఆహార పదార్థాల ద్వారా క్యాన్సర్‌ సమస్యను దూరం చేయవచ్చు.

Aliv seeds Benefits: క్యాన్సర్‌ ముప్పు తగ్గాలంటే ఈ గింజలను రోజూ తినాలి
New Update

Aliv seeds Benefits: ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసులు, ఆడమగ తేడా లేకుండా అందరూ క్యాన్సర్‌ సమస్యతో భాదపడుతున్నారు. జీవనశైలితో పాటు అనేక రకాల పర్యావరణ సమస్యల వలన క్యాన్సర్‌ ప్రమాదం పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పలు నివేదికల ప్రకారం 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసుల వారికి వేగంగా క్యాన్సర్‌ పెరుగుతోందటున్నారు. అయితే.. అన్ని రకాల క్యాన్సర్లలో చర్మ క్యాన్సర్‌ కూడా ఒకటి. ఈ చర్మ క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన ఉంటే అప్పుడు చికిత్స చేయడం సులువుగా ఉంటుంది. అందుకే హెచ్చరిక సంకేతాలతో పాటు ఆహారం తీసుకోవాటం ముఖ్యం.

ఇది కూడా చదవండి:  సెల్‌ఫోన్‌ ఎక్కువగా వాడితే బరువు పెరుగుతారా..?

ఆలివ్‌ సీడ్స్‌ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని కొన్ని ప్రాంతాల్లో హలీమ్‌, గార్డెన్ క్రెస్ విత్తనాలని పిలుస్తుంటారు. ఈ విత్తనాలను మనం రోజు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ అలివ్ విత్తనాలు చిన్నగా, ఎర్రరంగులో ఉంటాయని చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఈ చిన్నచిన్నగా ఉండే విత్తనాల్లో.. విటమిన్ సి, ఇ, ఎ, ఫోలేట్, ఫైబర్‌, ప్రోటీన్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలివ్‌ సీడ్స్‌లోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని రోజూవారీ ఆహారంలో తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ఆలివ్‌ సీడ్స్‌ తింటే ఉపయోగాలు

  • అలివ్ విత్తనాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ‌, కార్సినోజెనిక్, ఆక్సిడెంట్లు, ఫైటోస్టెరాల్స్ లక్షణాలు మెండుగా ఉంటాయి. శరీర కణాలను రక్షించి క్యాన్సర్ పెరుగుదలను నివారిస్తోంది. అలివ్ విత్తనాలలో గ్లూకోసినోలేట్స్ క్యాన్సర్ విస్తరణను, అభివృద్ధిని నిరోధిస్తోంది.
  • అలివ్‌ విత్తనాల్లో ఫైబర్‌, ప్రొటీన్‌ పుష్కలం. ఎక్కువసేపు నిండుగా ఉంచి ఆకలి కోరికలను, అతిగా తినకుండా కంట్రోల్‌ చేస్తుంది. మీ బరువు కంట్రోల్‌లో ఉంచి.. హెల్తీగా బరువు తగ్గడానికి, కండర ద్రవ్యరాశికి సహాయపడుతోంది.
  • అలివ్ గింజల్లో విటమిన్-ఎ, సీ, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలిక్ యాసిడ్‌ వంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెచ్చడానికి బెస్ట్‌ ఐటమ్‌. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు, జ్వరం, జలుబు, గొంతునొప్పి వంటి అంటువ్యాధులను నివారిస్తోంది.
  • మహిళలకు నెలసరి సక్రమంగా రాక ఇబ్బందిగా ఉండే హలీమ్‌ విత్తనాలను రోజు తినాలి. హలీమ్ గింజల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ పాత్రను పోషించే ఫైటోఈస్ట్రోజెన్‌  గర్భాశయం చుట్టూ రక్తప్రవాహాన్ని చేసి పీరియడ్స్‌ సక్రమంగా వచ్చేలా చేస్తోంది.
  • అలివ్‌ గింజలల్లో ఐరన్‌ కంటెంట్‌ అధికం. మహిళలు, చిన్నారులు రక్తలేమి సమస్య ఉంటే దూరం చేయడానికి సూపర్‌ ఫుడ్‌. రోజూ అలివ్ లడ్డూ తింటే మహిళల్లో హిమోగ్లోబిన్ పెరుగుతోంది.

#health-benefits #aliv-seeds-benefits
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe