IPL Records: అయ్యో.. ఈసారీ ఐపీఎల్ లో ఈ రికార్డులు చెక్కు చెదరలేదు.. కొట్టేవాడే లేడా.. 

ఐపీఎల్ లో కొన్ని రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆ రికార్డుల దరిదాపుల్లోకి కూడా ఎవరూ వెళ్లలేకపోయారు. ఈ సీజన్ లో కూడా ఆ రికార్డులను చేరుకున్న వారు కనిపించలేదు. చెక్కుచెదరని ఆ రికార్డులపై ఈ ఆర్టికల్ లో ఓ లుక్కేస్తే, ఇవి చెరపలేని రికార్డులని మీరూ ఒప్పుకుంటారు. 

IPL Records: అయ్యో.. ఈసారీ ఐపీఎల్ లో ఈ రికార్డులు చెక్కు చెదరలేదు.. కొట్టేవాడే లేడా.. 
New Update

IPL Records: ఐపీఎల్ అంటేనే ధనా ధన్ మోత. బ్యాటర్లకు పిచ్చ ఆవేశం వచ్చేస్తుంది. బాల్ దొరికితే చాలు బాధేయాలన్నంత కసితో ఉంటారు. టెస్ట్ క్రికెట్ నుంచి వన్డే.. తర్వాత టీ 20 పొట్టి ఫార్మేట్ లోకి వచ్చేసిన క్రికెట్ లో క్లాసిక్ మాట పోయింది. బ్యాట్ పెట్టుడు.. ఉతుకుడు మొదలెట్టాడు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇక ఐపీఎల్ లో  అయితే, కొత్త కుర్రాళ్ళు వచ్చి మోత మోగించేస్తున్నారు. కానీ.. టెక్నీక్ విషయంలో వీళ్ళు నిలబడలేకపోతున్నారనిపిస్తుంది. ఒకటి రెండు మ్యాచుల్లో వీర బాదుడు బాది. తరువాత సీజన్ లో చల్లబడిపోతున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఇదేదో మామూలుగా అంటున్న మాట కాదు. ఐపీఎల్ లో కొన్ని రికార్డులు ఇప్పుడు ఆడుతున్న కుర్రోళ్ళు కనీసం దగ్గరకు కూడా చేరలేకపోతున్నారు. ఆ రికార్డులు చూస్తే అవును నిజమే కదా అని మీరూ అంటారు. ఎందుకంటే, ఈ రికార్డులు సృష్టించింది అప్పటి ఆటగాళ్లే. అవీ అలంటి ఇలాంటి రికార్డులు కావు. 

ఐపీఎల్ లో టాప్ టోటల్..
ఐపీఎల్ 2024 సీజన్ లో విరాట్ కోహ్లీ మొత్తం 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ కొట్టేశాడు. మొత్తం ఇప్పటి వరకూ ఈ లీగ్ లో విరాట్ కోహ్లీ చేసిన పరుగులు 8,004. దీని దరిదాపుల్లో ఇప్పుడు ఎవరూ లేరు. ఇకపై వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే, ముందే చెప్పినట్టు.. ఇప్పటి బ్యాటర్లకు నిలకడ లేమి!

publive-image

అత్యధిక ఫోర్లు.. 
శిఖర్ ధావన్ ఐపీఎల్ లో అత్యధిక బౌండరీలు(IPL Records) బాదిన ఆటగాడు. మొత్తం 768 ఫోర్లు అతని ఖాతాలో ఉన్నాయి. అతని తరువాత విరాట్ ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకూ 705 ఫోర్లు కొట్టాడు. వచ్చే సీజన్ లో కోహ్లీ ఆడితే.. ఫోర్లు దంచితే.. ధావన్ రికార్డ్ బద్దలు కావచ్చు. కానీ.. అవకాశాలు తక్కువ. 

సూపర్ సిక్స్ లు.. 

publive-imageఇప్పటివరకూ ఐపీఎల్ లో ఎక్కువ సిక్స్ లు బాదింది క్రిస్ గేల్. మొత్తం 357 సిక్సర్లు కొట్టి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని తరువాత రోహిత్ శర్మ 280 సిక్సర్లతో ఉన్నాడు. ఈ రికార్డు కూడా ఇప్పుడప్పుడే చెదిరేలా కనిపించడం లేదు. 

క్రిస్ గేల్ ఎవర్ గ్రీన్ రికార్డ్.. దీన్ని కొట్టేవారున్నారా?
2013లో బెంగళూరు తరఫున ఆడుతూ క్రిస్ గేల్ 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. క్రిస్ గేల్ ధాటికి బలైన జట్టు పూణే. ఇప్పటికీ ఆ రికార్డ్(IPL Records) వైపు చూసే సాహసం చేశేవారు ఉన్నట్టు కనిపించడం లేదు. 

చాహల్ డబుల్ సెంచరీ..
డబుల్ సెంచరీ అంటే రన్స్ కాదు. వికెట్లు.. చాహల్ ఈ సీజన్ లో 18 వికెట్లు తీసుకున్నాడు. దీంతో అతను ఐపీఎల్ లో రెండు వందల వికెట్ల మైలురాయి అందుకున్నాడు. మొత్తం 205 వికెట్లు అతని ఖతాలో ఉన్నాయి. అతని తరువాత 192 వికెట్లతో పీయూష్ చావ్లా ఉన్నాడు. 

బెస్ట్ బౌలింగ్..
ఐపీఎల్ లో బౌలర్ల రికార్డ్ అంత బాగోదు. కానీ.. ఒక బౌలర్ ఒక మ్యాచ్ లో మేజిక్ చేశాడు. ఆటను అల్జారీ జోసెఫ్. కేవలం 12 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. 2011లో ముంబై తరఫున ఆడుతూ హైదరాబాద్ ను తన బౌలింగ్ తో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ రికార్డ్(IPL Records) కూడా ఎవర్ గ్రీనే!

డాట్ బాల్స్.. 

bhuvaneshwarటీ20 లో డాట్ బాల్స్ వేసే బౌలర్ అంటే గొప్పే. ఎందుకంటే, ప్రతి బాల్ ఇక్కడ విలువైనదే. బ్యాటరల్ కోణంలో చూస్తే ఒక్క బాల్ వదిలేసినా.. చాలా నష్టపోయినట్టే. అయితే, భువనేశ్వర్ కుమార్ ఇప్పటి వరకూ 1670 డాట్ బాల్స్ వేశాడు. అతని వెనుక నరైన్ 1605 డాట్ బాల్స్ వేసి బ్యాట్స్ మన్ కు చుక్కలు చూపించాడు. 

ఒకే సీజన్ లో ఎక్కువ పరుగులు
ఈ రికార్డ్ కూడా కోహ్లీ పేరు మీదే ఉంది. 2016లో కోహ్లీ 973 పరుగులు చేశాడు. ఇది కూడా ఇప్పుడప్పుడే చెరిపేసే బ్యాటర్ (IPL Records)ఎవరూ లేరు అనడంలో సందేహం లేదు. కోహ్లీ తరువాత సీజన్ లో ఎక్కువ పరుగులు చేసింది గిల్ 2023 సీజన్ లో అతను 890 ప్రరుగులు చేశాడు. 

ఒకే సీజన్ లో ఎక్కువ సిక్స్ లు..
ఇది క్రిస్ గేల్ రికార్డ్. 2012 సీజన్ లో గేల్ 59 సిక్సర్లు బాదాడు. అతని తరువాత 2019లో రస్సెల్ 52 సిక్స్ లు కొట్టి ఆగిపోయాడు. ఇక ఎవరూ ఈ దరిదాపుల్లోకి(IPL Records) కూడా రాలేదు. 

అవండీ ఐపీఎల్ కొన్ని ముఖ్యమైన రికార్డులు. ఈ రికార్డులు ఎవరు బద్దలు కొట్టినా వాళ్ళు పొట్టి క్రికెట్ లో గట్టి హీరోలుగా నిలబడిపోతారనడంలో సందేహం లేదు. కానీ, ఈ రికార్డులు ఏవీ కూడా అంత ఈజీగా చేరుకోగలిగేవి మాత్రం కాదు. 

#ipl #ipl-records
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe