Business Ideas: తక్కువ పెట్టుబడి- లక్షల్లో లాభాలు..కొన్ని బిజినెస్ ఐడియాలు మీకోసం

చాలామంది యువత ప్రస్తుత కాలంలో సొంత వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉంటున్నారు. కానీ, వ్యాపారానికి పెట్టుబడి పెట్టడం అనేది వారికి పెద్ద సమస్యగా మారింది. అయితే.. చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి లక్షల్లో సంపాదించాలనే వారికి ఈ బిజినెస్ ఐడియాలు ఉపయోగపడుతాయి.

Business Ideas: తక్కువ పెట్టుబడి- లక్షల్లో లాభాలు..కొన్ని బిజినెస్ ఐడియాలు మీకోసం
New Update

ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం చేస్తున్న.. ఎన్నో ఆస్తులు ఉన్నా కానీ.. సొంత వ్యాపారాల వైపు యువత మొగ్గు పెడుతున్నారు. వారి కాళ్లపై వారే నిలబడాలనే ఆశతో ఎన్నో ప్రయత్నాలపై ఇష్టం చూపిస్తుటారు. అంతేకాకుండా చాలా మంది జాబ్‌ చేస్తునే వ్యాపార పెట్టి సైడ్ బిజినెస్ లాంటివి చేస్తుంటారు. మరి కొంతమంది యువత ఉద్యోగం చేస్తూనే సైడ్‌ ఇన్‌కమ్‌ కోసం ఎన్నోఎన్నో సరికొత్త మార్గాలు ప్రయత్నాలు చేస్తు ఉంటారు. కరోనా ప్రజలందరిని ఆర్థిక కష్ట్రాల్లోకి నెట్టిన విషయం తెలిసిందే. ఆ నష్టం నుంచి కోలుకోవాటాకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త వ్యాపారాలు అనేవి చాలా అవసరం. ఇప్పటి రోజుల్లో ఇంట్లో ఇద్దరు ఎంతో కొంత డబ్బులు సపాదిస్తేనే ఇళ్లు గడిచే పరిస్థితులు ఉన్నాయి. దీంతో.. కొందరికి వ్యాపారం చేయాలన్న కోరిక ఉన్నా.. పెట్టుబడి విషయానికి వస్తే వారికి పెద్ద అవాంతరంగా ఉంటుంది. అయితే.. టాలెంట్ ఉండి బిజినెస్ చేయాలనుకునే వారికోసం తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదించే బిజినెస్ ఐడియాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రీలాన్స్ కంటెంట్‌ రైటింగ్
టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు మార్కెట్‌లో చాలా ఉన్నాయి. ప్రస్తుత ఫ్రీలాన్సర్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. కంటెంట్‌ రైటింగ్ నుంచి.. కోడింగ్‌ వంటి స్కిల్స్‌ ఉన్న వారికి ఆన్‌లైన్‌లో ఎన్నో ఫ్రీలాన్స్ అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఎవరు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టే అవసరం లేదు. కేవలం మీకున్న నైపుణ్యాల ఆధారంగా సైడ్‌ ఇన్‌కమ్‌ సంపాదించవచ్చు. లింక్డ్‌ఇన్ లాంటి ఉద్యోగ పోర్టల్స్‌లో ఇలాంటి ఫ్రీలాన్సర్‌లకు సంబంధించిన ఉద్యోగాల సమాచారం ఎక్కువగానే ఉంటుంది. మార్కెట్‌లో ఆన్‌లైన్‌ బిజినెస్‌ చాలా ఎక్కువగానే ఉన్నాయి. వాటిల్లో టెక్నాలజీతో ఎవరైనా సరే తమ వస్తువులను ఆన్‌లైన్‌లో అమ్ముకుని ఇన్‌కమ్‌ సంపాదించే వీలు ఉంది. తక్కువ పెట్టుబడితో ప్రొడక్ట్స్‌ ఈబే, ఈస్టీ వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు ఆన్‌లైన్‌లో విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నాయి. అంతేకాదు.. వీటిల్లో హాల్‌సేల్‌లో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో అమ్ముతుంటే ఏ ఇబ్బది లేకుండా మంచి సైడ్ ఇన్‌కమ్‌ వచ్చి మీ ఖాతాలో చేరుతుంది.

చిన్నచిన్న ఫంక్షన్లకు కూడా క్యాటరింగ్ సేవలు

ఈ రోజుల్లో క్యాటరింగ్‌కు మారెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. చాలామంది చిన్నచిన్న ఫంక్షన్లకు కూడా క్యాటరింగ్ సేవలే వినియోగించుకుంటున్నారు. అయితే.. ఈ మధ్య కాలంలో ఇంట్లో చేసే వంటకాలకు జనం ఎక్కువగా ఇంట్రెస్ట్‌ పెడుతున్నారు. కాబట్టి ఇంట్లోనే ఉండేవారు పలు రకాల ఫుడ్‌ ఐటమ్స్‌ రెడీ చేయవచ్చు. దీంతో క్యాటరింగ్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. ఈ పని చేయటానికి ఎక్కువగా డబ్బులు పెట్టుబడి పట్టే అవసరం ఉండదు. మీకు స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలా ఇప్పుడు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా కేవలం టాలెంట్‌తో డబ్బు సంపాదించవచ్చు. ఆ మార్గమే యూట్యూబ్ ఛానెల్. యూట్యూబ్‌లో మంచి మంచి వీడియోలు పోస్ట్ చేసి చాలామంది డబ్బులను సంపాదించుకుంటున్నారు. టూరిజం, ఎంటర్ టైన్‌మెంట్, ఆన్‌లైన్‌ ట్యూటరింగ్‌ లాంటి వీడియోలు చేస్తూ ఎంతోమంది డబ్బు సంపాదిస్తున్నారు. ఖర్చు లేకుండా యూట్యూబ్‌ ఛానెల్ ఓపెన్ చేస్తే మంచి బిజినెస్ మీ సొంత. ఇంకెందుకు ఆలస్యం మీకు ఉన్న టాలెంట్‌తో సొంత బిజినెస్ చేసి ఈజీగా మనీని మీ సొంతం చేసుకోండి.

ఇది కూడా చదవండి: బ్లాక్ సాల్ట్‌లో బోలెడు ఖనిజాలు..తింటే అద్భుత ప్రయోజనాలు

#business-ideas #own-business
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe