Mountains : పర్వతాలు.. ప్రకృతి నిలయాలు. ప్రపంచం(World) లో ఉన్న అద్భుతాలలో పర్వతాలు సైతం ఓ భాగమే. ఆకాశాన్నంటేలా గంభీరంగా ఉంటే వాటిలో ఎన్నో ప్రకృతి అందాలు దాగి ఉంటాయి. ప్రకృతి ప్రేమికులను(Nature Lovers) ఎల్లప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాయి. అందుకే వాటి ఎత్తుల్లో దాగి ఉన్న రహష్యాలను అన్వేషించడానికి సాహసికులు, ట్రెక్కర్లు, ప్రకృతి ఔత్సాహికులు ఆసక్తి చూపుతుంటారు. ప్రపంచాన్ని ఆకర్షించే ఎత్తైన పర్వతాలు చాలా వరకు భారత ఉపఖండం, చుట్టుపక్కలే ఉండడం విశేషం. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
మౌంట్ ఎవరెస్ట్
ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం.. మౌంట్ ఎవరెస్ట్(Mount Everest) 8,848 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఇది నేపాల్ - టిబెట్ సరిహద్దులో ఉంది. టిబెటన్లు దీన్ని కోమో లాంగ్మా అని పిలుస్తారు. చైనా వాళ్లు జుము లాంగ్మా అంటారు. నేపాలీలు సాగర మాత అని పిలుస్తుంటారు. అలాగే పర్వతాన్ని గౌరీశంకర శిఖరం అని అంటారు.
K2
K2 లేదా మౌంట్ గాడ్విన్-ఆస్టెన్ భూమిపై రెండవ ఎత్తైన శిఖరం, ఇది పాకిస్తాన్, చైనాలలో విస్తరించి ఉన్న కారకోరం శ్రేణిలో ఉంది. K2 దాని విపరీతమైన కష్టం మరియు అనూహ్య వాతావరణానికి ప్రసిద్ధి చెందింది, ఇది ఒక సవాలుగా ఉండేలా చేస్తుంది. కే2 పర్వతాన్ని హిమాలయాల సైరన్‌గా సూచిస్తారు. కే2 ఎత్తు 8611 మీటర్లు. K2 చేరుకునే మార్గం త్రిభుజాకరంలో ఉంటుంది పర్వతాలను దాటుకుంటూ వెళ్లాలి. 2008 లో ఇక్కడ ఒకే రోజు ఎక్కుతున్న 11 మంది పర్వతారోహకులు మరణించారు.
కాంచన్‌జంగా
కాంచన్ జంగా ప్రపంచంలోనే మూడో ఎత్తైన పర్వతం. 8586 మీటర్ల ఎత్తు ఉంటుంది. నేపాల్, భారతదేశం(Nepal-India) సరిహద్దులో ఉంది. కాంచన్‌జంగాలో 5 శిఖరాలు ఉన్నాయి. కాంచన్ జంగా స్థానిక మాండలికంలో ఐదు మంచు నిధులు అని అర్థం. ఇది 8,000 మీటర్లకు పైగా ఉన్న ఐదు శిఖరాలను సూచిస్తుంది. కాంచన్‌జంగాని కొందరు కాంచెన్ ద్జోంగా, కచెండ్ జోంగా, కంచన్ ఫంగా అని కూడా పిలుస్తారు.
లోట్సే
ఇది ప్రపంచంలోనే నాల్గో ఎత్తైన పర్వతం. నేపాల్, టిబెట్ అటానమస్ రీజియన్ సరిహద్దులో హిమాలయ పర్వత శిఖరం. ఇది మూడు శిఖరాలను కలిగి ఉంది. వీటిలో ఎత్తైనది - 27,940 అడుగుల (8,516 మీటర్లు) వద్ద ఉన్న లోట్సే I - ప్రపంచంలోని నాల్గవ ఎత్తైన శిఖరం. ఎవరెస్ట్ పర్వతానికి దగ్గరగా దక్షిణంగా ఉంటుంది. మే 18, 1956న, ఇద్దరు స్విస్ అధిరోహకులు ఫ్రిట్జ్ లుచ్‌సింగర్, ఎర్నెస్ట్ రీస్, లోట్సేను తొలిసారి అధిరోహించారు.
Also Read : సొంత తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు.. కారణం ఇదే
మకాలు
నేపాల్-టిబెటన్ సరిహద్దు హిమాలయాలలో ఉన్న ఎత్తైన పర్వతాలలో ఒకటి. 8,463 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఎవరెస్ట్ పర్వతానికి ఆగ్నేయంగా 23 కిమీ దూరంలో ఉంది. మే 15, 1955న జీ న్కూజీ, లియోనెల్ టెర్రే అనే పర్వతారోహకులు దీనిని అధిరోహించారు.
చో ఓయు
ఎవరెస్ట్ పర్వతానికి వాయువ్యంగా 30 కిమీ దూరంలో నేపాలీ - టిబెటన్ సరిహద్దులో చో ఓయు శిఖరం ఉంది. దీని ఎత్తు 8,201 మీటర్లు ఉంటుంది. ప్రపంచంలో ఆరో అతిపెద్ద శిఖరం ఇది. అక్టోబర్ 19, 1954న హెర్బర్ట్ టిచీ, సెప్ జోచ్లర్, పసాంగ్ దావా లామా, షెర్పా బృందం ఈ శిఖరాన్ని అధిరోహించింది.
ధౌలగిరి
ధౌలగిరి నేపాల్ హిమాలయాల్లో ఎత్తైన మరో శిఖరం ఇది. ప్రపంచంలో ఏడో ఎత్తైన శిఖరంగా గుర్తింపు పొందింది. దౌలగిరి అంటే సంస్కృతంలో తెల్లని అందమైన పర్వతం అని అర్థం. కాళీ గండక్ నదికి సమీపంలో ఉంది. నాలుగు పర్వతాల సమూహం ఇది. 8,167 మీటర్ల ఎత్తు ఉంటుంది.
మనస్లు
మనస్లు ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలలో ఎనిమిదో స్థానంలో ఉంది. 8,163 మీటర్లు ఉంటుంది. ఉత్తర నేపాల్‌లోని హిమాలయాల్లో గూర్ఖా పట్టణానికి ఉత్తరాన 38 61 కిమీ దూరంలో ఉంది.
నంగా పర్బత్
ఆక్రమిత కాశ్మీరులోని గిల్గిట్ బాల్టిస్తాన్‌లో చిలాస్, అస్తోర్ ప్రాంతాల మధ్య ఉన్న ఈ శిఖరం ఎత్తు 8,130 మీటర్లు ఉంటుంది. నంగా పర్బత్ అంటే ‘నగ్న పర్వతం’ అని అర్థం. దీనిని ఎక్కే క్రమంలో అనేక మంది మరణించడంతో దీనికి ‘కిల్లర్ పర్వతం’ అనే పేరు వచ్చింది. 1953లో హెర్మన్ బుహ్ల్ (ఆస్ట్రియన్ జర్మన్) అనే పర్వతారోహకుడు మొదటిసారి ఈ పర్వతాన్ని అధిరోహించాడు.
అన్నపూర్ణ
అన్నపూర్ణ పర్వతం 8,091 మీటర్ల ఎత్తు ఉంటుంది. ప్రపంచంలోనే పదో ఎత్తైన శిఖరం ఇది. ఇందులో 7 వేల చిన్న శిఖరాలు ఉన్నాయి. నేపాల్‌లో ఉన్న అన్నపూర్ణ మాసిఫ్ అద్భుతమైన అందాలకు ప్రసిద్ధి చెందింది. ఈ పర్వతాలు పశ్చిమాన కాళీగండక్ జార్జ్, ఉత్తరం, తూర్పుల్లో మార్ష్యంగ్డి నది, దక్షిణాన పోఖ్రా లోయల నడుమ విస్తరించాయి.