ఢిల్లీలో భారీగా పెరగుతున్న ఇళ్ల ధరలు..కారణాలు ఇవే...!!

New Update
ఢిల్లీలో భారీగా పెరగుతున్న ఇళ్ల ధరలు..కారణాలు ఇవే...!!

జనవరి-మార్చి 2023 మధ్య ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఇళ్ల ధరలు 16 శాతం వరకు పెరిగాయి. దేశంలోని ఎనిమిది పెద్ద నగరాలతో పోలిస్తే ఇది అత్యధికం అనే చెప్పాలి. ఢిల్లీలో ఇళ్ల ధరలు పెరగడానికి డిమాండ్‌, నిర్మాణ వ్యయం పెరగడమే అతిపెద్ద కారణమని నిపుణులు చెబుతున్నారు. హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ రిపోర్ట్ Q1, 2023 ప్రకారం బుధవారం CREDAI, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్, రియల్టర్ల అపెక్స్ బాడీ అయిన డేటా అనలిటికల్ సంస్థ లియాసెస్ ఫోరాస్ ఒక నివేదిక విడుదల చేసింది.

Delhi ncr home price

ఏ నగరంలో ధరలు ఎంత పెరిగాయి?
ఈ రిపోర్ట్ ప్రకారం, దేశంలోని ఎనిమిది అతిపెద్ద నగరాలు వార్షిక ప్రాతిపదికన ఇళ్ల ధరలు 8 శాతం పెరిగాయి.

>> ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గృహాల ధర అత్యధికంగా 16 శాతం పెరిగి స్క్వేర్ ఫీట్ కు రూ.8,432కు పెరిగింది.
>> కోల్‌కతాలో ఇంటి ధరలు 15 శాతం పెరిగి స్క్వేర్ ఫీట్ కు రూ.7,211కి చేరుకున్నాయి.
>> అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు 11 శాతం పెరిగి స్క్వేర్ ఫీట్ కు రూ.6,324కు చేరుకున్నాయి.
>> బెంగళూరులో ఇంటి ధరలు 14 శాతం పెరిగి స్క్వేర్ ఫీట్ కు రూ.8,748కి చేరుకున్నాయి.
>> హైదరాబాద్‌లో స్క్వేర్ ఫీట్ .కు 13 శాతం పెరిగి రూ.10,410కి చేరుకుంది.
>> పూణెలో ఇళ్ల ధరలు కూడా 11 శాతం పెరిగి స్క్వేర్ ఫీట్ కు రూ.8,352కి చేరుకున్నాయి.
>> ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ధర రెండు శాతం తగ్గి రూ.19,219కి చేరుకుంది.

ఢిల్లీలో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి:
ప్రధానంగా సెంట్రల్ పెరిఫెరల్ రోడ్, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలను NH-8కి కలిపే లూప్ ఏర్పడినందున, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే చుట్టూ ధరలలో 59 శాతం పెరుగుదల కనిపించిందని రిపోర్టులు చెబుతున్నాయి. ఎన్‌సిఆర్‌లో, గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో ఇంటి ధరలు 42 శాతం మేర పెరిగాయి. ఇది ఎన్‌సిఆర్‌లోని ఏ ప్రాంతంలోనైనా అత్యధికం.

Advertisment
Advertisment
తాజా కథనాలు