World Most Expensive Foods: ప్రపంచంలో లగ్జరీ కారు, లగ్జరీ ఇల్లు, లగ్జరీ డ్రెస్సులు చూసే ఉంటాం. అత్యంత ఖరీదైన లగ్జరీ ఆహారాలు ఎంటో మీకు తెలుసా..? ఎందుకంటే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆహారాలలో.. అరుదుగా చెప్పే పేర్లు. అయితే.. ఎన్నో రకాల ఆహారపదార్థాల ప్లేట్‌కు లక్షలు ఖర్చు చేస్తారు. వాటిట్లో తినడం అందరికీ అందుబాటులో ఉండదని తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒక లగ్జరీ కారు మీకు ఒక ప్లేట్ ధరకే ఖర్చు ఎక్కువ. దీనిని తినడానికి కోటీశ్వరులు కూడా ఆలోచిస్తారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆహారపదార్థాలు, వాటి ధరల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలో ఖరీదైన ఆహారపదార్థాలు ఇవే
అల్మాస్ కేవియర్: కేవియర్ స్టర్జన్ చేపల అండాశయాలలో కనిపించే గుడ్లను అల్మాస్ కేవియర్ అంటారు. ఇండియా కరెన్సిలో అల్మాస్ కేవియర్ ధర కిలోగ్రాముకు రూ. 29 లక్షలు ఉంది. ఇది ఇరానియన్ బెలూగా స్టర్జన్ చేప నుంచి ఈ కేవియర్‌ను తీస్తారు. ఇరాన్‌కు సమీపంలోని కాస్పియన్ సముద్రంలోని శుభ్రమైన ప్రాంతాల్లో బెలూగా స్టర్జన్ చేపల అరుదైన జాతులు.
కుంకుమపువ్వు : కుంకుమపువ్వు ఒక రకమైన మసాలా, దీని ప్రత్యేక రుచి, సువాసన దాని ప్రత్యేకం. భారతీయ వంటలలో కుంకుమపువ్వును ఎక్కువగా ఉపయోగిస్తారు. కుంకుమపువ్వు సువాసన అంటే చాలామంచికి ఇష్టం ఉంటుంది. ఒక గ్రాము కుంకుమపువ్వు ధర దాదాపు రూ.1600 ఉంటుంది. ఈ రకంగా చూస్తే కిలో కుంకుమపువ్వు దాదాపు రూ.16 లక్షలు ఉంటుంది. సాధారణంగా కుంకుమపువ్వు ఇరాన్‌లో ఎక్కువగా పెరుగుతుంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తారు.
బ్లూఫిన్ ట్యూనా చేప: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహార పదార్థాలలో బ్లూఫిన్ ట్యూనా చేప ఒకటి. ఈ జాతి చేపలు విలుప్త అంచున ఎక్కువగా ఉంటాయి. బ్లూఫిన్ ట్యూనా జపాన్ యొక్క సుషీ, సాషిమి వంటలలో ప్రధాన భాగం. బ్లూఫిన్ ట్యూనా బరువు 200-250 కిలోలు ఉంటుంది. బ్లూఫిన్ ట్యూనా ధర దాదాపు రూ. 5 లక్షలు.
ఎల్విష్ తేనె: టర్కీలో కనిపించే తేనె ఖరీదైనదే. దీనిని ఎల్విష్ హనీ అంటారు. ఈ తేనె టర్కీలోని ఆర్ట్విన్ నగరంలో 1,800 మీటర్ల లోతైన గుహ నుంచి సేకరించారు. ఈ తేనెలో తేనెటీగ ఉండదు. ఎల్విష్ తేనె సహజంగా అడవి పూల పుప్పొడి నుంచి సేకరించి, ఓ గుహలో ద్రవంగా ప్రాసెస్ చేస్తారు. దాని రుచి, ప్రత్యేక స్థానం కారణంగా, ఎల్విష్ తేనె కిలో ధర రూ.4.44 లక్షలు ఉంటుంది.
ఐబెరికో హామ్: ఖరీదైన ఆహారాలలో ఐబెరికో హామ్ ఒక నల్ల పంది యొక్క వెనుక కాలులో భాగం ఒకటి. ఇది 24 నుంచి 36 నెలల వరకు పోర్చుగల్, స్పెయిన్‌లో ఉత్పత్తి చేస్తారు. ఈ మాంసాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత సాల్టెడ్, ఎండబెట్టి, 3 సంవత్సరాలు నిల్వ చేస్తారు. ఐబెరికో హామ్ ధర దాదాపు రూ.3.75 లక్షలు. నాణ్యతను బట్టి దీని ధర ఎక్కువ, తక్కువ ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఈ ఆహారాలు తింటే వృద్ధాప్య ఛాయలు ఉండవు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.