సమ్మర్‌లో ఉండే వేడి కారణంగా శరీరంలోని నీరు త్వరగా ఆవిరవుతుంది. అలాగే శరీరంలో వేడి పెరిగి జీర్ణవ్యవస్థపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో డైట్‌ను కాస్త గమనించుకోవాలంటున్నారు డాక్టర్లు. ముందుగా సమ్మర్‌లో ఏది పడేతే అది తినే అలవాటుని మానుకోవాలి. డైట్‌లో నీటి శాతం ఉండే ఆహారాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో నీటి శాతం బ్యాలెన్స్ అవుతుంది.
సమ్మర్‌లో తినకూడని ఫుడ్స్ విషయానికొస్తే ముందుగా ఈ సీజన్‌లో ఆయిల్ ఫుడ్స్‌ను అవాయిడ్ చేయడం మంచిది. వేగించిన పదార్థాల వల్ల దాహం ఎక్కువవుతుంది. అలాగని తిన్న వెంటనే నీళ్లు తాగుతూ ఉంటే తిన్నది సరిగా జీర్ణమవ్వక ఇబ్బందిపడాల్సి వస్తుంది. కాబట్టి సమ్మర్‌లో ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించాలి. సమ్మర్‌లో స్పైసీ ఫుడ్స్‌ను కూడా తగ్గించాలి. కారం, మసాలాలు ఎక్కువగా వేసిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల పొట్టలో మరింత హీట్ జనరేట్ అవుతుంది. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి సమ్మర్‌లో మసాలాలు తగ్గిస్తే బెటర్. సమ్మర్‌లో దూరం పెట్టాల్సిన మరో ఫుడ్ నాన్‌వెజ్. సమ్మర్‌లో మాంసాహారం ఎక్కువగా తింటే జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌లో వీలైనంత తక్కువగా మాంసాహారాన్ని తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి.
సమ్మర్‌లో కూల్ వాటర్, చల్లటి జ్యూస్‌ల వంటివి ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది. అయితే అలాంటివి తీసుకునేటప్పుడు మరీ చల్లగా ఉండకుండా జాగ్రత్తపడాలి. సమ్మర్‌లో టీ, కాఫీ, పాల పదార్థాలను కూడా తగ్గిస్తే మంచిది. వీటి ద్వారా శరీరంలో డైజెషన్ తగ్గుతుంది. అలాగే సమ్మర్‌లో కూల్ డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ జోలికి కూడా వెళ్లకపోవడమే మంచిది. వాటికి బదులు ఇంట్లోనే జ్యూస్‌లు లేదా ఫ్లేవర్డ్ వాటర్స్ వంటివి చేసుకుని తాగొచ్చు. సమ్మర్‌లో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బాడీ మరింత డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సీజన్‌లో ఈ అలవాటుకి దూరంగా ఉంటే మంచిది. అలాగే స్మోకింగ్ వల్ల కూడా శరీరంలో వేడి, బీపీ పెరగుతాయి.
These are the foods that should not be eaten in summer