మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల ఇన్ఫెర్టిలిటీ సమస్య పెరుగుతుంది. దీనికి చాలా కారణాలుండొచ్చు. జన్యు పరమైన కారణాలతోపాటు హార్మోనల్ ఇంబాలెన్స్, యాంటీ-స్పెర్మ్ యాంటీబాడీస్, కొన్నిరకాల ఇన్ఫెక్షన్ల వంటి కారణాలు కూడా ఉంటాయి. వీటితోపాటు స్మోకింగ్, డ్రింకింగ్, ఇతర ఆహారపు అలవాట్లు కూడా స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయి. అయితే లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గినవాళ్లు కొన్ని ఫుడ్స్‌తో దాన్ని సరిచేయొచ్చు. అదెలాగంటే..
ఫెర్టిలిటీని పెంచేందుకు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే విటమిన్లు, మినరల్స్ బ్యాలెన్స్డ్గా ఉండేలా సమతుల ఆహారం తీసుకోవాలి. ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉన్నవాళ్లు కాయగూరలు ఎక్కువగా తినాలి. క్యాబేజీ, క్యారెట్, పాలకూర, మునగాకు వంటి వాటిలో ఏ, సీ,ఈ, కె విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆకుకూరల్లో ఉండే ఫోలేట్(విటమిన్ బీ9) వీర్యకణాల్లో డీఎన్ఏ వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది.
నిజం ఇదే స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు హెల్దీ ఫ్యాట్స్ కూడా ముఖ్యమే. దీనికోసం నెయ్యి, బటర్, పాలు వంటివి తీసుకోవచ్చు. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం చేపలు, నట్స్ వంటివి కూడా తీసుకోవాలి. వీటిలో ఉండే జింక్.. టెస్టోస్టిరోన్ హార్మోన్‌ను పెంచేందుకు తోడ్పడుతుంది. ఇక వీటితోపాటు హై క్యాలరీలు, షుగర్ ఉండే కార్బో్హైడ్రేట్స్కు బదులు కాంప్లెక్స్ కార్బ్స్ ఉండేలా బ్రౌన్ రైస్, మిల్లెట్స్ వంటివి తీసుకుంటే ఫెర్టిలిటీ సమస్య మరింత త్వరగా తగ్గుతుంది. అలాగే ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉన్నవారు స్మోకింగ్, డ్రింకింగ్‌కు దూరంగా ఉండాలి. ఇన్ఫెర్టిలిటీ సమస్యకు ఇతర కారణాలు ఉన్నట్టు గుర్తిస్తే డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.