Money Plant: మనీప్లాంట్, తులసి మొక్కలు అక్కడ పెడుతున్నారా? అయితే, జాగత్ర..! కొన్ని మొక్కలను పవిత్రంగా చూసుకోవడం ఆనవాయితి. అలాంటి మొక్కల్లో మనీప్లాంట్, తులసి మొదటి స్థానంలో ఉంటాయి. వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు, మరికొన్ని నియమాలు ఉన్నాయి. మొక్కలు ఇంట్లో సరైన దిశలో ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు. మరి అవేమిటో తెలియాలంటే ఆర్టికల్ లోకి వెళ్లండి..! By Jyoshna Sappogula 14 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Money Plant and Tulasi: ప్రతి ఇంట్లో కొన్ని మొక్కలు ఇంట్లో పెంచుకోవడాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఇంకొన్ని మొక్కలను పవిత్రమైనవిగా కూడా భావిస్తారు. అలాంటి మొక్కల్లో మనీ ప్లాంట్, తులసి మొక్కలు ముందుంటాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే, వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు, మరికొన్ని నియమాలు ఉన్నాయి. ఈ మొక్కలు ఇంట్లో సరైన దిశలో పెట్టాలి. తప్పు దిశలో పెడితి మాత్రం ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చని పండితులు హెచ్చరిస్తున్నారు. నియమానుసారం ఈ మొక్కలను పెంచుకుంటే ఇబ్బంది కూడా లేకుండా ఉంటుందని అంటారు. మరి మనీ ప్లాంట్, తులసి ఎక్కడ పెడితే మంచిది..ఎక్కడ పెట్టకూడదనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. Also Read: ఎండాకాలంలో చల్లచల్లని బాదాం మిల్క్ ఎంతో మేలు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..! మనీ ప్లాంట్.. వాస్తును అనుసరించి మనీ ప్లాంట్ ఎప్పుడూ కూడా ఈశాన్య దిక్కున పెట్టుకోకూడదని అంటున్నారు. మనీ ప్లాంట్ ఆగ్నేయ దిక్కున పెట్టుకోవడం మంచిదట. అందువల్ల ఇంట్లో సుఖశాంతులు వస్తాయని పండితులు చెబుతుంటారు. పచ్చని మనీ ప్లాంట్ ఐశ్వర్యానికి చిహ్నం అని కూడా అంటారు. ఇంట్లో ఎండిపోయిన మనీప్లాంట్ మొక్కను ఉంచుకోకూడదని.. ఒక వేళ మనీప్లాంట్ లో ఎండిపోయిన ఆకులు ఉంటే వెంటనే తీసెయ్యాలని సూచిస్తున్నారు. మనీ ప్లాంట్ తీగ ఎప్పుడూ కూడాపైకి ఎగబాకేలాగా ఉండాలని.. కింది వైపు రాకూడదని పండితులు అంటున్నారు. ఇలా పెట్టకూడదు.. మనీ ప్లాంట్ ఎప్పుడూ కూడా ఇంటికి బయట పెట్టకూడదని.. ప్లాస్టిక్ కుండిలో కూడా పెట్ట కూడదని వ్యాఖ్యానిస్తున్నారు. గాజు బాటిల్ లో పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మనీ ప్లాంట్ ను పడక గదిలో కూడా పెంచుకోవచ్చట. దానివల్ల నిద్రలేమి, ఆందోళనలు కూడా తగ్గుముఖం పడతాయని.. పడకగదిలో ఒకమూల పెంచుకోవచ్చని అంటున్నారు. అయితే అది ఆరోగ్యంగా పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇంట్లో పెంచుకుంటున్న మనీ ప్లాంట్ ను ఎవరికీ ఇవ్వకూడదని అంటున్నారు. అలా చేస్తే మీకు దక్కాల్సిన పుణ్యఫలాలు దూరమవుతాయని శాస్త్రం చెబుతోందట. Also Read: పండుగల సమయంలో స్వీట్లు తిన్న కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే! తులసి మొక్క. ఇంట్లో తులసి మొక్క ఉంటే ప్రసరించే గాలి శుద్ధవుతుందని అందరు అంటారు. గాలిలోని హానికారక రసాయనాలను శోషిస్తుందని.. ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా నిరోధిస్తుందని పండితులు చెబుతారు. తులసి మొక్కను పెంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని కూడా అంటారు. ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు రాకుండా తులసి కాపాడుతుందని.. ఇంట్లోకి సౌభాగ్యం తోపాటు.. ధనవృద్ధికి దోహదం చేస్తుందని చెబుతుంటారు. కుటుంబ ఆర్థిక స్థితి మెరుగు పడడానికి తులసి మొక్క తప్పకుండా పెంచుకోవాలట. కుటుంబ సభ్యుల రక్షణకు కూడా తులసి మొక్క పెంచడం మంచి ఉపాయమని అంటారు. ఎందుకంటే తులసి దిష్టి నుంచి కూడా ఇంటిని కాపాడుతుందని.. తులసి మొక్క ఉన్న ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయని పండుతులు కూడా అంటుంటారు. జాగ్రత్త పడాలి.. వాస్తును అనుసరించి తులసి మొక్కను ఇంటిలో సరైన స్థానంలో ఉంచాలని.. అప్పుడే తులసి వల్ల కలగాల్సిన అన్ని లాభాలు కలుగుతాయని చెబుతారు. తులసి మొక్కను తూర్పు దిక్కున పెట్టుకోవడం అన్నింటికంటే శ్రేష్టమని అంటారు. అక్కడ పెట్టే అవకాశం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యంలో బాల్కనీ లేదా కిటికిలో పెట్టుకోవచ్చుని.. మొక్కకి సరిపడేంత వెలుతురు కూడా ఉండే విధంగా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. పూజ గదిలో కుండిలో ఏర్పాటు చేసుకుని వెలుతురు తగిలేలా జాగ్రత్త పడితే సరిపోతుందని పండితులు అంటున్నారు. ప్రతి రోజూ సంధ్యా సమయంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే తులసి మొక్కని లక్ష్మీ దేవి భౌతిక రూపంగా భావించి కొలుస్తుంటారు. #money-plant-and-tulasi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి