Vijayawada: ముగిసిన విజయవాడ దుర్గ గుడి పాలక మండలి సమావేశం..ఏం నిర్ణయించారంటే! సోమవారం విజయవాడ దుర్గగుడి పాలక మండలి సమావేశం జరిగింది.ఈ సమావేశం పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు , ఈఓ రామారావు పాల్గొన్నారు.సమావేశంలో గుడికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. బస్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. By Bhavana 29 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Vijayawada: సోమవారం విజయవాడ దుర్గగుడి (Durga Temple) పాలక మండలి సమావేశం(Meeting) జరిగింది. ఈ సమావేశం పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు(Karnati Rambabu) , ఈఓ రామారావు పాల్గొన్నారు. 8వ పాలకమండలి సమావేశంలో గుడికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేసి అమ్మవారి ప్రసాదాన్ని అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఎలివేటేడ్ క్యూలైన్లు ఏర్పాటుకు పాలక మండలి సభ్యులు ఆమోదించినట్లు చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. ఇక నుంచి కొండ పైనే పూజా మండపాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. శివాలయం అంతరాయంలో ఏసీ, మండపం చుట్టూ లైటింగ్ ఏర్పాటుకు కూడా సభ్యులు ఆమోదించినట్లు రాంబాబు వివరించారు. మూడు రోజుల క్రితం అమ్మవారిని సుమారు లక్ష మంది భక్తులు దర్శనం చేసుకున్న్నట్లు తెలిపారు. అలాగే వీఐపీలు, వికలాంగులు, వృద్దుల నివేదన సమయం ఉదయం 11.30 గంటల నుంచి 1.30 వరకు ముగుస్తుందని ఈ విషయాన్ని భక్తులు గమనించాలని అర్థం చేసుకోవాలని చైర్మన్ కోరారు. త్వరలో బస్సుకు పర్మిషన్ తెచ్చుకుని గిరి ప్రదక్షిణ మార్గం మొత్తం కూడా బస్సును తిప్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే ఘాట్ రోడ్డు మరమ్మత్తులు చేసేందుకు నిర్ణయించామని వివరించారు. వచ్చే దసరా నాటికి మాస్టర్ ప్లాన్ లో పనులకు ఓ రూపం తీసుకుని వస్తామని వివరించారు. కొండ చరియల అంశంపై మంత్రితో కూడా చర్చించి త్వరలో పూర్తి చేస్తాం అని పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు వివరించారు. Also read: చంద్రబాబు నాయుడికి తృటిలో తప్పిన ప్రమాదం! #vijayawada #meeting #governing-body మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి