"భవిష్యత్తుకు గ్యారెంటీ"లో మండపేటలో రైతులతో సీబీఎన్ రచ్చబండ

తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పట్నంలో నిర్వహించిన సభలో విజన్‌ డాక్యుమెంట్‌ 2047 ని ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంట్ ను ఇండియా ఇండియన్స్‌ తెలుగూస్‌ పేరుతో రూపొందించారు.

New Update
"భవిష్యత్తుకు గ్యారెంటీ"లో మండపేటలో రైతులతో సీబీఎన్ రచ్చబండ

Chandrababu TOUR:  భవిష్యత్తుకు భరోసా పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వివిధ జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా వివిధవర్గాల వారితో మాట్లాడుతున్నారు. మండపేటలో బుధవారం (ఆగస్టు16) మధ్యాహ్నం 3 గంటలకు ఆయన రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు.  అంతకు ముందు విశాఖపట్నంలో (Visakhapatnam)నిర్వహించిన సభలో విజన్‌ డాక్యుమెంట్‌ 2047 ని ఆవిష్కరించారు.  ఇండియా ఇండియన్స్‌ తెలుగూస్‌ పేరుతో రూపొందించిన ఈ  డాక్యుమెంట్‌ లో ఇండియా నెంబర్‌ 1 అవ్వాలి అంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి..ఏం చేస్తే అవుతాము అనే ప్రణాళికను అందులో పొందుపరిచారు. చంద్రబాబు నాయకత్వంలోని జీఎఫ్ఎస్టీ బృందం 5 వ్యూహాలను ఈ విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోలార్ విద్యుత్ ఒక యూనిట్ రూ.1.50 నుంచి రూ.2.00కి వస్తుందంటే అందరూ ఎగతాళి చేశారు. ప్రస్తుతం రూ.1.99కి వచ్చింది. విస్తృత స్థాయిలో ఉత్పాదన చేసినప్పుడు ఆటోమేటిగ్గా రేట్లు తగ్గుతాయి. ఆ మేరకు టీడీపీ ప్రభుత్వం (TDP Govt) చొరవ చూపింది. ఇండియాకి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం...మంచి ఎండ అంటూ ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు సోలార్ విద్యుత్ (Solar Power)ఒక యూనిట్ రూ.14 ఉంటే, ఇప్పుడు బాగా తగ్గిపోయింది.

సోలార్‌ ద్వారా కరెంట్‌ అనేది కేవలం ఎండ ఉన్న సమయంలోనే వస్తుంది. ఎండలేని సాయంత్రం వేళలో గాలి ద్వారా కూడా విద్యుత్‌ తయారు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇవేవీ లేనప్పుడు పంప్డ్ ఎనర్జీ తీసుకోవాలి. ఈ మూడింటిని కలిపినదే హైబ్రిడ్ మోడల్. దీని ద్వారా అన్ని రంగాలకు విద్యుత్ అందించవచ్చు. వీటివల్ల కాలుష్యం కూడా ఉండదు. డిజిటలైజేషన్ వల్ల విద్యుత్ గ్రిడ్ మేనేజ్ చేసుకోవచ్చు అని ఆయన వివరించారు.

సోలార్ ఎనర్జీ గేమ్ ఛేంజర్ కాబోతుంది. నీటిని ఎంత సమర్ధవంతంగా వినియోగించుకుంటే అంత ఫలితం ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం (YCP Govt) రివర్స్ టెండర్రింగ్ పేరుతో గోదావరిలో కలిపేశారు. ప్రస్తుతం టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. టెక్నాలజీ ప్రాధాన్యత తెలియక భ్రష్టు పట్టిస్తున్నారు. టెక్నాలజీ కొంతమందికే పరిమితం చేయకుండా పెదవారి వరకు వెళ్లాలి.

బటన్‌లు నొక్కడం వలన ఫలితం లేదు. రూపాయి ఇచ్చి 50 రూపాయిలు తీసుకుంటున్నారు. రాష్ట్రాన్ని అనేక విధాలుగా దోచుకున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. యువత, మేధావులు, ప్రతి ఒక్కరూ చేసిన ఒక పొరపాటు ఫలితాలను, భవిష్యత్తులో అనుభవిస్తామని వివేకానంద చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి." అని చంద్రబాబు చెప్పారు.

నన్ను ఎంతగానో అభిమానించే నగరం విశాఖ. హుద్ హుద్ సమయంలో విశాఖ నగరం కకావికలం అయిపోయింది. ఆ సమయంలో విశాఖను చూస్తే నాకు ఎంతో బాధ కలిగింది. విశాఖలోనే ఉండి నగరాన్ని మరల సుందరంగా తీర్చిదిద్దాం. విశాఖలో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించారు. బీచ్ రోడ్డులోని ర్యాలీ చేస్తే విశాఖ నగరవాసులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో ఏర్పడిన పార్టీ టీడీపీ. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారున్నా అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది.

వారి అభివృద్ధి కోసం నిరంతరం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. తెలుగుదేశం పార్టీ (Telugu Desam party) తెలుగు వారిని రిప్రజెంట్ చేస్తుంది. తెలుగు జాతి అన్ని రంగాలలో ముందు ఉండాలి. నేను ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది.

ఒక దుర్మార్గుడు చేసిన పనికి అమరావతి (Amaravati) బలైపోయింది. విశాఖ వాసులు కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారు. ఆర్థికంగా ముందుకు వెళ్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. సంపద సృష్టించవచ్చు." అని చంద్రబాబు అన్నారు.

Also Read: ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం

Advertisment
తాజా కథనాలు