వీళ్లు మామూలు కేటుగాళ్లు కాదు..ఐఎంఈఐ నెంబర్ నే మార్చేస్తున్నారు..ముఠా గుట్టును రట్టు చేసిన హైదరాబాద్ కాప్స్!!

వీళ్లు మామూలు కేటుగాళ్లు కాదని ఏకంగా పోలీసులే ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఎంత ఖరీదైనా ఫోన్ పోయినా పర్లేదు.. ఐఎంఈఐ నెంబర్ ఉంది కదా.. అన్న భరోసాకే ఈ కేటుగాళ్లు తూట్లు పొడుస్తున్నారు..ఖరీదైన ఫోన్లను కొట్టేస్తున్న ఓ గ్యాంగ్ ఆ ఫోన్ల ఐఎంఈఐ నెంబర్ ను మార్చేసి తిరిగి వాటిని కొత్త సెల్ ఫోన్లుగా అమ్మేస్తోంది..

వీళ్లు మామూలు కేటుగాళ్లు కాదు..ఐఎంఈఐ నెంబర్ నే మార్చేస్తున్నారు..ముఠా గుట్టును రట్టు చేసిన హైదరాబాద్ కాప్స్!!
New Update

వీళ్లు మామూలు కేటుగాళ్లు కాదని ఏకంగా పోలీసులే ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఎంత ఖరీదైనా ఫోన్ పోయినా పర్లేదు.. ఐఎంఈఐ నెంబర్ ఉంది కదా.. అన్న భరోసాకే ఈ కేటుగాళ్లు తూట్లు పొడవడమే అందుకు కారణం. ఖరీదైన ఫోన్లను కొట్టేస్తున్న ఓ ముఠా ఆ ఫోన్ల ఐఎంఈఐ నెంబర్ ను మార్చేసి తిరిగి వాటిని కొత్త సెల్ ఫోన్లుగా అమ్మేస్తున్నారు.

ఇక ఈ గుట్టును గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ గ్యాంగ్ కర్ణాటక, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఖరీదైన ఫోన్లను కొట్టేసి హైదరాబాద్ కు తీసుకొని వస్తున్నారు. వాటి ఐఎంఈఐ నెంబర్లను మార్చేసి.. అమ్మేస్తున్నారు. అయితే పక్కా సమాచారంతో ఈ గ్యాంగ్ ను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

రి దగ్గర్నుంచి 563 ఖరీదైన ఫోన్లను స్వాధీనం చేసున్నారు. వాటి విలువ అక్షరాలా.. 2.50 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ముఠాలో 50కి పైగా గ్యాంగ్ మెంబర్స్ ఉంటారని ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే ముఠా హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఇక్కడ ఫోన్ లు కొట్టేసి.. ముంబై, ఢిల్లీలలో ఐఎంఈఐ నెంబర్లు మార్చి విక్రయిస్తోంది.

అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో మొబైల్ ఫోన్ ల ఐఎంఈఐ నెంబర్లు మార్చే స్థావరం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది కనిపెడితే.. ఈ ముఠా కార్యకలాపాల గురించి మరింత సమాచారం లభించే ఛాన్స్ ఉంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి