/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-02T133811.838-jpg.webp)
Benefits Of Eating Almonds : బాదం(Almonds) ఆరోగ్యానికి(Health Benefits) అన్ని విధాలా మేలు చేస్తుంది. బాదం పప్పును రోజూ తినడం వలన వాటిలో ఉండే పోషకాలు, ఖనిజ లవణాలు సైతం శరీరానికి తగు మొత్తంలో అంది ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుతుంది. బాదం పప్పును అనేక రకాలుగా తినవచ్చు, అది పచ్చిగా తినవచ్చు లేదా నానబెట్టి తినవచ్చు. ఇంకా చెప్పాలంటే డెజర్ట్‌లు, కూరలు లేదా సలాడ్‌లలో కూడా చేర్చి తీసుకోవచ్చు. దీనిలో పోషకాలు విరివిగా ఉండడం వలన మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం. ఇవి చాలా రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి, అందానికి కూడా మెరుగైనది.
1. జుట్టు పెరుగుదలకు బాదం:
శరీరంలో మెగ్నీషియం లోపం అనేది జుట్టు రాలడానికి దారితీస్తుంది. బాదంపప్పులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. కనుక వాటిని రోజూ తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా ఉండి స్థిరంగా పెరగడానికి సహాయపడుతుంది. అంతే కాదు, జుట్టు తెల్లబడడం వంటి సమస్యలకు బాదం నూనెను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు తలలో చుండ్రు మరియు పొడి చర్మం, బలహీనమైన జుట్టు మొదలైన ఇతర సాధారణ జుట్టు సమస్య(Hair Problems) లను నయం చేయడానికి బాదం నూనెను తరచూ ఉపయోగించవచ్చు. దీనివల్ల జట్టు సిల్కీగా, నిగనిగలాడుతూ ఉంటుంది.
2. చర్మ ఆరోగ్యానికి బాదం:
మీ చర్మ ఆరోగ్యాన్ని(Healthy Skin) మెరుగుపరిచేందుకు బాదంలో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు బాగా పనిచేస్తాయి. ముఖంపై వచ్చే మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ లేదా వైట్ హెడ్స్‌ను కూడా బాదాం నయం చేస్తుంది. బాదం పప్పులో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మ రంధ్రాలను మూసుకుపోకుండా చేస్తాయి. ఫలితంగా మొటిమలు, బ్లాక్‌హెడ్స్ మరియు వైట్‌హెడ్స్ రాకుండా ఉంటాయి. అలాగే చర్మంలో ఉండే బాక్టీరియాను తొలగించడంలో బాదాంలోని పోషకాలు పనిచేస్తాయి. గోరు వెచ్చని బాదం నూనెను మీ చర్మంపై అప్లయ్ చేసి చూడండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
3. మెదడు పనితీరుకు బాదం:
మెదడు పనితీరును(Brain Work) బాదం మెరుగుపరుస్తుంది. మెదడులో ఉత్తేజిత హార్మోన్ల పెరుగుదలకు ఇది సహాయపడుతుంది. ఫెనిలాలనైన్ అనే రసాయనం మెదడు చురుకుదనానికి సహాయపడుతుంది. ఇది మీరు బాదం ద్వారా పొందవచ్చు. అందువల్ల ప్రతిరోజూ ఉదయం కనీసం ఐదు నుండి ఆరు బాదం పప్పులను తినడం మంచిది.
4. గుండె ఆరోగ్యానికి బాదం:
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం బాదం పప్పును తరుచూ తీసుకోవాలి. గుండె సమస్యలు ఉన్నవారు బాదం వారి ఆహరంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. అంతేకాదు రక్తపోటును తగ్గించడంలో శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రవాహాన్ని అందించడంలో సహాయపడతుంది.
5. కొలెస్ట్రాల్ నియంత్రణకు బాదం:
అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు, శరీరంలో విటమిన్ E స్థాయిలను పెంచేందుకు బాదం ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకోసం ప్రతిరోజూ కొన్ని పచ్చి బాదం పప్పులను తినవచ్చు లేదా ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు బాదం మిల్క్ షేక్‌లాంటివి తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. అలాగే రక్తప్రవాహంలో విటమిన్ ఇ స్థాయిలను పెంచి కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుకోవచ్చు.
6. బరువు తగ్గడం కోసం బాదం:
బాదం పప్పులో కార్బోహైడ్రేట్‌లు తక్కువగా ఉండటం, ప్రొటీన్లు మరియు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల అవి చాలా గంటల పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. ఇది రోజంతా అవసరమైన ఆహారం కంటే ఎక్కువ తినడం నుండి మిమ్మల్ని ఆపివేస్తుంది. ఇది చివరికి బరువు నిర్వహణకు దారితీస్తుంది. బాదం తినడం వలన బరువు చాలావరకూ నియంత్రించవచ్చు. అధిక బరువు ఉన్న వారు తప్పనిసరిగా వారి డైట్‌లో భాగంగా చేసుకోవాలి.
Also Read : మీ ఇంట్లో బుద్ధుని విగ్రహం ఉందా..? ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..!