Home Making Tips: సాధారణంగా ప్రతి ఇంట్లో బొద్దింక బెడద ఉంటుంది. అపరిశుభ్రంగా ఉన్న ఇళ్లలో ఇవి ఎక్కువ సంఖ్యలో తిరుగుతుంటాయి. ముఖ్యంగా వంట గదిలో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. వీటి కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతారు. అయితే, కొన్ని చెట్లు ఇంట్లో ఉండటం వల్ల బొద్దింకలు పరార్ అవుతాయి. మరి బొద్దింకలను తరిమే ఆ చెట్లు ఏంటో ఓసారి చూద్దాం..
పూదీన (Mint Plant): పూదీనా చెట్టు ఇంట్లో ఉండటం వల్ల బొద్దింకలు సహా ఇతర కీటకాలు ఇంటి నుంచి బయటకు పారిపోతాయి. పూదీనా వాసన కీటకాలకు నచ్చదు. ముఖ్యంగా బొద్దింకలు ఈ వాసనకు తట్టుకోలేక ఇంట్లోంచి బయటకు వెళ్లిపోతాయి. అందుకే ఇంట్లో పూదీనా మొక్కను పెంచడం ఉత్తమం.
రోజ్మేరీ ప్లాంట్(Rosemary Plant): రోజ్మేరీ మొక్క బొద్దింకలను ఇంటి నుంచి తరిమేస్తుంది. దీని నుంచి వాసనకు బొద్దింకలు ఇంట్లో ఉండలేవు. బొద్దింకలను తరిమేయడానికి ఈ చెట్టు అద్భుత పరిష్కార మార్గం అని చెబుతున్నారు నిపుణులు.
క్యాట్నిప్ ప్లాంట్(Catnip Plant): ఈ మొక్క బొద్దింకలను తరిమికొట్టడంలో అద్భుతంగా సహాయపడుతుంది. క్యాట్నిప్ మొక్క వల్ల బొద్దింకలు ఇంట్లోకి అడుగు పెట్టాలంటేనే భయపడుతుంది.
లెమన్‌గ్రాస్ ప్లాంట్(Lemongrass Plant): లెమన్ గ్రాస్ మొక్క తాజా, ఎండిన ఆకులు రెండూ తీవ్రమైన ఘాటు వాసనను ఇస్తుంది. బొద్దింకలు ఈ వాసనను తట్టుకోలేవు. ఈ చెట్టును ఇంట్లో పెట్టడం వలన బొద్దింకలు దరిచేరకుండా ఉంటాయి.
వెల్లుల్లి(Garlic): ఇంట్లో వెల్లుల్లి మొక్కను నాటితో మేలు జరుగుతుంది. ఈ చెట్టు నుంచి వచ్చే ఘాటైన వాసన కారణంగా బొద్దింకలు సహా ఇతర కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
గమనిక: ఈ మొక్కలు అన్ని రకాల కీటకాలను పూర్తిగా తరిమేస్తాయని ఖచ్చితంగా ధృవీకరించడం లేదు. ప్రజల సాధారణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని అందిస్తున్నాం. పైన పేర్కొన్న అంశాలను RTV ధృవీకరించడం లేదు.