ప్రపంచంలోని ఈ 5 దేశాల్లో ఆదాయపు పన్నులేదని మీకు తెలుసా?

ప్రపంచంలోని ఈ 5 దేశాలను ధనవంతుల స్వర్గధామంగా పిలుస్తారు. మొనాకో, బహుమాస్ ద్వీపం, దుబాయ్, బెర్మూడా, కేమాన్ దీవులకు లాంటి దేశాలకు వ్యక్తిగత ఆదాయ పన్ను విధించటం లేదు. దీంతో అక్కడ నివసించటానికి చాలామంది విదేశీయులు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రపంచంలోని ఈ 5 దేశాల్లో ఆదాయపు పన్నులేదని మీకు తెలుసా?
New Update

విలాసవంతమైన జీవనశైలి అందమైన మధ్యధరా తీరప్రాంతానికి ప్రసిద్ధి చెందిన మొనాకోకు వ్యక్తిగత ఆదాయపు పన్ను లేదు. ఇది ధనవంతుల స్వర్గ నిలయంగా పరిగణలో ఉంది. బహామాస్ ద్వీపంలో కూడా అద్భుతమైన బీచ్‌లు విలాసవంతమైన జీవనశైలిని కలిగి ఉంది. అంతే కాదు ఇక్కడ ఆదాయపు పన్ను లేకపోవటంతో విదేశీయులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతుంది.

దుబాయ్  అబుదాబిలో, వ్యక్తిగత ఆదాయపు పన్ను విధించబడదు. అలాగే UAE ఆధునిక జీవనశైలిని అందిస్తుంది. ఇది అంతర్జాతీయ వ్యాపారానికి అభివృద్ధి చెందుతున్న కేంద్రం.బెర్ముడా వ్యక్తిగత ఆదాయపు పన్ను లేని అందమైన ద్వీపం. ఆర్థిక ప్రయోజనాలతో ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించాలనుకునే వారికి ఇది అనువైన ప్రదేశం.ఆర్థిక సేవల రంగానికి ప్రసిద్ధి చెందిన కేమాన్ దీవులకు వ్యక్తిగత ఆదాయపు పన్ను లేదు. ఇక్కడ వ్యక్తిగత ఆదాయం, వ్యాపార ఆదాయం ఆస్తి పన్ను విధించబడదు.

#world
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe