Home Tips: ఇంట్లో ఈ వస్తువులు పెట్టుకున్నారంటే కష్టాలు తప్పవు

గ్లాసు తొట్టెలో చేపలను పెంచడం వల్ల ఇంటి యజమానికి కష్టాలు ఉంటాయి. ఇంట్లో మ‌హాభార‌తం యుద్ధం ఫొటోలతో పాటు పోస్టర్లు, మనీప్లాంట్స్‌, పనిచేయని వాచ్‌లు పెట్టుకున్నారంటే నెగెటివ్‌ ఎనర్జీ వస్తుందని పండితులు చెబుతున్నారు. ఏ దిక్కున ఏ వస్తువులు పెట్టాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Home Tips: ఇంట్లో ఈ వస్తువులు పెట్టుకున్నారంటే కష్టాలు తప్పవు

Home Tips: ఇంటిని అందంగా ఉంచుకునేందుకు రకరకాల వస్తువులను పెట్టుకుంటూ ఉంటాం. చూసేందుకు చక్కగా కనిపించినా వాస్తుపరకంగా కొన్ని మంచివి కాదంటున్నారు నిపుణులు. రంగురాళ్లు, గడ్డిమొక్కలు, అక్వేరియం ఇంట్లో లేదా ఆఫీసులో ఉంచుకోకూడదని అంటున్నారు. అక్వేరియం ఇంట్లో ఉంచితే చెడు జరుగుతుందని, మానసిక ప్రశాంతత కూడా కరవు అవుతుందని అంటున్నారు. అలాగే కొన్ని వస్తువులు కూడా ఇంట్లో ఉంచుకోకూడదని సలహా ఇస్తున్నారు.

publive-image

గ్లాసు తొట్టెలో చేపలను పెంచడం వల్ల ఇంటి యజమానికి కష్టాలు ఉంటాయని, సంతోషం కూడా ఉండదని అంటున్నారు. అంతేకాకుండా అప్పులు కూడా బాగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇళ్లలో పనిచేయని వాచ్‌లను కూడా ఉంచుకోకూడదని అంటున్నారు. ఇక మ‌హాభార‌తం యుద్ధం ఫొటోలతో పాటు పోస్టర్లు కూడా ఉంచుకోకూడదని,ఇలా ఉంచితే కష్టాలు తప్పవని వాస్తు నిపుణులు అంటున్నారు.

publive-image

ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనీప్లాంట్స్‌ని ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు. దీని వల్ల వారికి అదృష్టం వస్తుందని నమ్ముతారు. మ‌నీప్లాంట్‌ని ఇంట్లో పెట్టుకుంటే నెగెటివ్‌ ఎనర్జీ వస్తుందని, ఇంట్లోకి దుష్టశక్తులు కూడా ప్రవేశిస్తాయని నిపుణులు అంటున్నారు. మ‌నీప్లాంట్‌ను ఇంటి బ‌య‌ట ఉంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

publive-image

ఇంట్లో క‌ప్పలు ఉంటే కష్టాలు క్యూ కడతాయని, వేలాయుధంతో కూడిన కుమార‌స్వామి ఫొటో అస్సలు ఉండకూడదని, పెద్దగా ఉన్న దేవతల బొమ్మలను కూడా ఉంచుకోకూడదని నిపుణులు అంటున్నారు. వ్యాపారం చేసే ప్రదేశంలో తూర్పు, ద‌క్షిణ దిక్కులో ఎక్కువ ప్లేస్‌ ఉంటే వ్యాపారం బాగా జరుగుతుందని, తూర్పుదిక్కుకు తిరిగి నిలబడి పూజ చేయాలి. ఇంటి ఎదుట హాస్పిటల్స్‌, మాంసం షాపులు, ఇనుము షాపులు ఉంటే కష్టాలు తప్పవని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: బెడ్‌రూమ్‌లో అద్దం పెట్టుకుంటున్నారా.. జాగ్రత్త

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు