Cow Milk: ఆరోగ్యానికి ఆవుపాలు..లీటరు 4 వేలు..జనాన్ని ముంచేస్తున్నారు 

ఆరోగ్యం కోసం A2 రకం ఆవుపాలు మంచివి అని ప్రచారం చేస్తున్నారు వ్యాపారులు. ఈ రకం పాల పేరుతో లీటరుకు 4 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే, ఇలా ఇకపై కుదరదని FSSAI పాల వ్యాపారులను హెచ్చరించింది . ఆవుపాల ఉత్పత్తులపై A1-A2 అనే ప్రచారం చేయవద్దని సూచించింది.

New Update
Cow Milk: ఆరోగ్యానికి ఆవుపాలు..లీటరు 4 వేలు..జనాన్ని ముంచేస్తున్నారు 

Cow Milk: ఆవుపాలు ఆరోగ్యానికి మంచిది. ఇది పురాతన కాలం నుంచి పెద్దలు చెప్పే మాట. కానీ, ఆవు పాలలో కూడా రకాలున్నాయి.. ఈరకం మంచిది కాదు.. వేరే రకం ఖరీదు ఎక్కువైనా ఆరోగ్యాన్ని కాపాడుతుంది అంటూ ఇప్పటి మిల్క్ సెల్లర్స్ ప్రకటనల హోరుతో.. ప్రజల జేబుకు కన్నం పెట్టేస్తున్నారు. డాక్టర్లు పాలు ఏ రకమైన సరే ఆరోగ్యకరమే. ఒకరకం అనారోగ్యం అనీ.. మరో రకం అమృతమనీ చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు అని ఎంత మొత్తుకున్నా ప్రజలు మాత్రం వ్యాపారుల ప్రకటనల గందరగోళంలో పడిపోయి నెలకు లీటరు నాలుగు వేల రూపాయలు ఖర్చు అయినా  ఫర్వాలేదు.. ఆరోగ్యం ముఖ్యం అని కొనేస్తూ.. పర్సులు ఖాళీ చేసుకుంటున్నారు. ఈ ఆరోగ్యం మాటున జరిగే ఈ దందా ప్రజల్ని వెర్రివాళ్లను చేసేస్తోంది డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే చెప్పింది. 

ఆవుపాలల్లో రకాలేంటి?

Cow Milk: ఆవుపాలు రెండు రకాలుగా చెబుతారు. ఒకటి A1 - రెండోది A2.  వీటిలో A1 రకం పాలలో beta-casein అనే ఎమినో యాసిడ్ ఉంటుంది. A2 రకం పాలలో ఇది ఉండదు. ఇదొక్కటే రెండిటి మధ్య తేడా. A1 రకం పాలు తాగితే కొద్దిగా అరుగుదల తక్కువగా అనిపిస్తుంది. అంటే జీర్ణం కావడం కొంచెం కష్టం. A2 పాలు కొద్దిగా తేలికగా జీర్ణం అవుతాయి అంతే అని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, ఈ జీర్ణం కావడం అనే చిన్న ఇబ్బందిని పెద్ద భూతంగా చూపించి.. ప్రచారంలో A1 మిల్క్ ఆరోగ్యానికి మంచిది కాదు అని ఒక పెద్ద అనుమానాన్ని నాటేశారు పాల వ్యాపారులు దీంతో చాలామంది ఖరీదు ఎక్కువైనా A2 మిల్క్ కొనేస్తూ వస్తున్నారు. ఈ రకం పాల ఖర్చు  రోజూ లీటరుపాలు తీసుకుంటే  నెలకు  4 వేల వరకూ ఉందని చెబుతున్నారు. అలాగే, ఈ పాలతో పాటు పాల ఉత్పత్తులు వెన్న, నెయ్యి వంటి వాటిని కూడా అధిక ధరలకు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక కేజీ నెయ్యి ధర దాదాపుగా రెండున్నర వేల వరకూ ఉంటోంది. అంటే, అముల్ నెయ్యి ధరకంటే నాలుగు రెట్లు ఎక్కువ. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.. ఆరోగ్యం పేరుతో జనాలను ఎలా దోచేస్తున్నారో. చాలాకాలంగా డాక్టర్లు ఇదంతా వట్టిదే అంటూ చెప్పుకుంటూ వస్తున్నా సరే.. వ్యాపారుల ప్రకటనల ముందు వారి అభిప్రాయం వీగిపోతూ వస్తోంది. ఇప్పుడు మన దేశంలో ఫుడ్ ప్రోడక్ట్స్ ని కంట్రోల్ చేసే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఒక ప్రకటన విడుదల చేసింది. 

Image

అందులో A1-A2 పాల మధ్య వ్యత్యాసం వివరిస్తూనే.. A2 పాలు మాత్రమే మంచివి అనే అభిప్రాయం తప్పు అంటూ తేల్చేసింది. కొంతమంది ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు (FBO) ఎక్కువ ధరతో A2 రకం పాలు.. పాల ఉత్పత్తులను అమ్ముతున్నారని తమ దృష్టికి వచ్చిందని ఆ ప్రకటనలో చెప్పింది. అంతేకాదు.. ఇది చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఇలా ప్రచారం చేసి అధిక ధరలకు పాలు అమ్మడం నేరంగా FSSAI పేర్కొంది. A2 మిల్క్ అంటూ పాలు, పాల ఉత్పత్తులపై అతికిస్తున్న లేబుళ్లను ఇకపై అతికించవద్దని ఆ డైరెక్షన్స్ లో స్పష్టంగా చెప్పింది. అంతేకాదు.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల పై లేబుల్స్ మార్పు చేసుకోవడానికి ఆరు నెలల సమయం ఇస్తున్నట్టు FSSAI చెప్పింది. 

ఈ ఉత్తర్వుల పట్ల డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎప్పటినుంచో చెబుతున్న విషయాన్ని ప్రభుత్వం అర్ధం చేసుకుని ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకున్నందుకు తమ సంతోషాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇప్పుడు ఆవుపాల ఉత్పత్తులపై A2 అని ముద్రించడం లేదా ప్రకటనల్లో A2 పాలు మంచివి అని ప్రచారం చేయడం వ్యాపారులకు కుదరదు. అవి ఏ రకమైనా ఆవుపాలు ఆరోగ్యానికి మంచిది. అంతే.

Advertisment
తాజా కథనాలు