/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Nara-Bhuvaneshwari-1-jpg.webp)
Nara Bhuvaneshwari: చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు మద్దతుగా రామకుప్పంలో భువనేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని పునాదులతో సహా పెకిలించాలని అన్నారు. జగన్ పాలనలో మహిళలకు భద్రత కరువైందని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యతో యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల దోపిడీకి ప్రజలు బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఓటుతో ఫ్యాన్ రెక్కలు ఊడి కిందపడాలని పిలుపునిచ్చారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారని అన్నారు.