Pithapuram: పిఠాపురంపై తీవ్ర ఉత్కంఠ.. అలర్ట్ అయిన ఈసీ..! పిఠాపురంలో గెలుపు ఎవరిదని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్ట్రాంగ్‌రూముల భద్రతపై అధికారులు నిరంతరం నిఘా పెట్టారు. కౌంటింగ్ రోజు పిఠాపురం, కాకినాడలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఇటీవల ఇంటలిజెన్స్ ఈసీకి నివేదిక అందించింది. దీంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. By Jyoshna Sappogula 21 May 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Pithapuram: ఏపీ చూపు పిఠాపురం వైపు ఉంది. పిఠాపురంలో గెలుపు ఎవరిదని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్ట్రాంగ్‌రూముల భద్రతపై అధికారులు నిరంతరం నిఘా పెట్టారు. కౌంటింగ్ రోజు పిఠాపురం, కాకినాడలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఇటీవల ఇంటలిజెన్స్ ఈసీకి నివేదిక అందించింది. ఈ నేపథ్యంలో ఈసీ హై అలర్ట్ అయింది. కాకినాడలో జిల్లా యంత్రాంగం స్ట్రాంగ్‌రూములను పరిశీలించింది. Also Read: రేవ్ పార్టీకి గ్యాంగ్ మాస్టర్ మంత్రి కాకాణే.. సోమిరెడ్డి సంచలన ఆరోపణలు..! కలెక్టర్ నివాస్, ఎస్పీ సతీష్‌కుమార్ భద్రతా వివరాలు తెలుసుకున్నారు. ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పాస్‌లు ఉన్నవారికే లోనికి అనుమతి ఉంటుందని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. కౌంటింగ్ రోజు విజయోత్సవ ర్యాలీలకు నో పర్మిషన్ అన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదేశించారు. #pawan-kalyan #pithapuram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి