గత ఏడాది అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడిలో భారీ సంఖ్యలో ఇజ్రాయెల్స్ మరణించారు. నోవా మ్యూజిక్ ఫెస్టివల్ పైసైతం హమాస్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 1,189 మంది మరణించగా.. 252 మందిని బందీలుగా తీసుకెళ్లారు. నోవా మ్యూజిక్ ఫెస్టివల్ లో ఉండగా హమాస్ చెరలో బందీ అయినవారిలో నోవా ఆర్గమాణి ఒకరు. అప్పటి నుంచి ఆమె హమాస్ బందీలోనే ఉంది. ఆమె బందీఖానాలో ఉన్న సమయంలో టెర్మినల్ బ్రెయిన్ క్యాన్సర్ తో ఆమె తల్లి లియోరా బాధపడుతుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సెంట్రల్ గాజాలోని నుసిరత్ లో శనివారం ఐడీఎఫ్ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ ను నిర్వహించింది. ఈ ఆపరేషన్ లో నోవా ఆర్గమాణితో పాటు మరో ముగ్గురు బంధీలను బయటకు తీసుకొచ్చింది. వీరిలో ఆండ్రీ కోజ్లోన్, అల్మోగ్ మీర్ జాన్, ష్లోమి జివ్ లు ఉన్నారు.
పూర్తిగా చదవండి..హమాస్ చెర నుంచి బయటపడ్డ ఇజ్రాయెల్ యువతి..
హమాస్ చెరలో బందీగా ఉన్న ఇజ్రాయెల్ కు చెందిన 26యేళ్ల నోవా ఆర్గమాణి ఎట్టకేలకు బయటపడ్డారు. 245 రోజుల సుదీర్ఘ బందీ తరువాత ఆమెను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆమెను రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో తల్లిదండ్రులను కలుసుకొని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
Translate this News: