వైరల్ వీడియో: జో బిడెన్ మాటలకు పగలబడి నవ్విన ప్రధాని మోడీ..!!

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ దంపతులు ప్రధానమంత్రి నరేంద్రమోడీ గౌరవార్థం వైట్ హౌస్ లో ఇచ్చిన స్టేట్ డిన్నర్ లో ఇంట్రెస్టింగ్ సన్నివేశం చోటుచేసుకుంది. జో బిడెన్, మోడీ లిద్దరూ కూడా మద్యం ముట్టనివారే కావడంతో..వారిద్దరూ అల్కహాల్ లేకుండా జింజర్ డ్రింకుతో గ్లాసులు పైకెత్తి చీర్స్ చెప్పారు. మద్యం లేకుండా టోస్ట్ పెంచడం గురించి తన తాత సలహాలను వివరించినప్పుడు మోడీతో సహా అక్కడున్న అతిథులంతా పగలబడి నవ్వారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

New Update
వైరల్ వీడియో: జో బిడెన్ మాటలకు పగలబడి నవ్విన ప్రధాని మోడీ..!!

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ దంపతులు ప్రధాని నరేంద్ర మోడీ గౌరవార్థ వైట్ హౌస్ లో ఇచ్చిన డిన్నర్ స్టేట్ లో ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. జోబిడెన్, మోడీ ఇద్దరూ కూడా మద్యం ముట్టుకోరు. దీంతో వారిద్దరూ ఆల్కహాల్ లేకుండా జింజర్ డ్రింకుతో గ్లాసులు పైకెత్తుతూ చీర్స్ చెప్పారు. జో బిడెన్ వైట్ హౌస్ లో రాష్ట్ర విందు సందర్బంగా టోస్ట్ చేసిన అనంతరం తన తాత ఆంబ్రోస్ ఫిన్నెగాన్ చెప్పిన సలహాను మోడీతో పంచుకున్నారో జో బిడెన్.

publive-image

ఆల్కహాల్ లేకుండా టోస్ట్ పెంచడం గురించి తన తాత సలహాను వివరించినప్పుడు మోడీతోపాటు అక్కడున్న అతిథులంతా ఒక్కసారిగా నవ్వారు. 400మంది అతిథులు హాజరైన ఈ డిన్నర్ ఈవెంట్ లో మోడీకి జో బిడెన్ టోస్ట్ ను అందించారు. టోస్ట్ ఇస్తే గ్లాసులో మద్యం లేనట్లయితే మీరు దాన్ని మీ ఎడమ చేతితో తాగాలని తన తాత చెప్పారని జో బిడెన్ ఆనాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. బిడెన్ చెప్పిన విషయాలను అనువాదకుడు హిందీలోకి అనువదిస్తుండగా అతిథులంతా నవ్వారు. ఈరోజు భారత ప్రధానితో కలిసి మే అద్భుత సమయాన్ని గడిపాం. భారత్, అమెరికా మధ్య గొప్ప స్నేహబంధం ఏర్పడిందంటూ బిడెన్ మోడీతో కలిసి డ్రింక్ గ్లాస్ పైకెత్తి చీర్స్ చెప్పారు. తనకు ఈ అద్భుతమైన విందు ఇచ్చినందుకు మోడీ జోబిడెన్ కు ధన్యవాదాలు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు