Tamilanadu: తమిళనాడులో రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి!

తమిళనాడులో (Tamilanadu) బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు (Six)మరణించారు.

New Update
Tamilanadu: తమిళనాడులో రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి!

Tamil Nadu Road Accident: తమిళనాడులో (Tamilanadu) బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు (Six)మరణించారు. హైవే పై ఆగి ఉన్న డీసీఎం ను ఓ వ్యాన్‌ వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఏడాది పాప కూడా ఉంది.

సేలమ్‌(Selam)-ఈరోడ్‌ (E road)హైవే పై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున కావడంతో డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. సుమారు తెల్లవారుజామున 4 గంటలకు ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌ లో 8 మంది ఉన్నారు. వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదానికి గురైన వ్యాన్‌ ఎనుగూరు నుంచి పెరుంతరై వైపు ఈ వాహనం వెళ్తున్నట్లు తెలుస్తుంది. మరణించిన వారిని సెల్వరాజ్‌, అర్ముగం, పళనిస్వామి, పప్పాతిగా గుర్తించారు. వీరిలో ఏడాది పాప కూడా ఉంది.

అయితే వ్యాన్ డ్రైవ‌ర్ విఘ్నేశ్‌తో పాటు మ‌రో ప్ర‌యాణికురాలు ప్రియా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిని ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన గురించి కేసు నమోదు చేసుకుని విచరాణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: ఇద్దరమ్మాయిలు సూసైడ్‌.. ప్రాణం తీసిన మార్ఫింగ్‌ ఫొటోలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు