Coco Gauff: 19 ఏళ్లకే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌.. చరిత్ర సృష్టించిన అమెరికా ప్లేయర్

యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సంచలన విజయం నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్‍లో బెలారస్‍కు చెందిన ప్ర‌పంచ రెండో సీడ్ అరీనా సబలెంకాను ఓడించి అమెరికా యువ సంచలనం కోకో గాఫ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. 19 ఏళ్లకే తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‍ను కైవసం చేసుకుని దిగ్గజ ప్లేయర్ సెరెనా విలియమ్స్ సరసన నిలిచింది.

Coco Gauff: 19 ఏళ్లకే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌.. చరిత్ర సృష్టించిన అమెరికా ప్లేయర్
New Update

Coco Gauff: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సంచలన విజయం నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్‍లో బెలారస్‍కు చెందిన ప్ర‌పంచ రెండో సీడ్ అరీనా సబలెంకాను ఓడించి అమెరికా యువ సంచలనం కోకో గాఫ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. 19 ఏళ్లకే తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‍ను కైవసం చేసుకుని దిగ్గజ ప్లేయర్ సెరెనా విలియమ్స్ సరసన నిలిచింది.

యూఎస్ ఓపెన్స్ ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. రెండో సీడ్ అరీనా సబలెంకా చేతిలో ఆరో సీడ్ అయిన కోకో 2-6 తేడాతో ఫస్ట్ సెట్ కోల్పోయింది. అయితే రెండో సెట్‌లో పుంజుకున్న కోకో అద్భుతమైన షాట్స్‌తో సబలెంకాను ఇబ్బందిపెట్టింది. దీంతో రెండో సెట్‌ 6-3తేడాతో గెలుచుకుంది. అనంతరం మూడో సెట్‌లోనూ విజృంభించి 6-2తేడాతో గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది.

2022లో ఫ్రెంచ్ ఓపెన్‌ రన్నరప్‌గా నిలిచిన కోకో గాఫ్ ఈసారి మాత్రం ఛాంపియన్‌గా రికార్డు సృష్టించింది. 1999లో సెరెనా విలియమ్స్ తర్వాత యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన తొలి అమెరికన్ టీనేజర్‌గా కోకో గాఫ్ చ‌రిత్ర తిరగరాసింది. అంతేకాకుండా అతి తక్కువ వయసులో యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన అమెరికన్ ఆటగాళ్లలో ట్రాసీ ఆస్టిన్, సెరెనా సరసన చేరింది. మరోవైపు ఆదివారం జరుగనున్న పురుషుల ఫైనల్ మ్యాచ్‌లో మెద్వెదెవ్‌తో రెండో ర్యాంకర్‌ నొవాక్ జొకోవిచ్‌ తలపడనున్నాడు.

#us-open-tennis #coco-gauff #aryna-sabalenka
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి