Coco Gauff: 19 ఏళ్లకే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్.. చరిత్ర సృష్టించిన అమెరికా ప్లేయర్
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సంచలన విజయం నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో బెలారస్‌కు చెందిన ప్రపంచ రెండో సీడ్ అరీనా సబలెంకాను ఓడించి అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 19 ఏళ్లకే తొలి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుని దిగ్గజ ప్లేయర్ సెరెనా విలియమ్స్ సరసన నిలిచింది.