Banana Export : అరటి పండే అని తీసిపారేయకండి.. ఎగుమతుల మార్కెట్లో దాని విలువే వేరు! అరటి పండ్ల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రపంచ అరటి ఉత్పత్తిలో 26.45 శాతం వాటా మనదే. కానీ, కేవలం ఒక్క శాతం ఎగుమతులు మాత్రమే అవుతున్నాయి. ప్రభుత్వం సముద్రమార్గం ద్వారా అరటి పండ్లను ఎగుమతి చేయడం కోసం కొత్త ప్రోటోకాల్ తీసుకువచ్చింది. By KVD Varma 28 Dec 2023 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి APEDA : అనారోగ్యంతో బాధపడేవారికి, పూజలకు ప్రధాన ఆహారంగా ఉపయోగించే అరటిపండు ఇప్పుడు ఆదాయాన్ని కూడా అందిస్తుంది. కేవలం అరటిపండ్లు అమ్మడం ద్వారా రూ.8300 కోట్లు ఆర్జించాలని భారత ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ విజయవంతమైన పైలట్ ప్రాజెక్టును కూడా పూర్తి చేసింది. సముద్ర మార్గం ద్వారా ఇతర దేశాలకు అరటిని ఎగుమతి చేస్తున్నారు. కొంత సమయం ఎక్కువ తీసుకున్నప్పటిఈ ఎగుమతి చేస్తున్న అరిటిపండ్ల(Banana Export) నాణ్యత మెరుగ్గా ఉందని చెబుతున్నారు. వాస్తవానికి, వచ్చే 5 సంవత్సరాలలో భారతదేశం తన అరటి ఎగుమతుల(Banana)ను విపరీతంగా పెంచుకోబోతోంది. వచ్చే 5 ఏళ్లలో దేశం నుంచి అరటిపండు ఎగుమతులను 1 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 8300 కోట్లు) పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల ప్రభుత్వం సముద్ర మార్గం ద్వారా నెదర్లాండ్స్‌కు అరటిపళ్లను పంపింది. ఈ కాలంలో, అరటిపండ్ల నాణ్యత చెడిపోకుండా ఉంచడానికి ప్రయత్నాలు జరిగాయి మరియు ఇందులో భారత ప్రభుత్వం విజయం సాధించింది. ఇలా చేస్తే అరటిపండ్ల నుంచి ఆదాయం.. ప్రస్తుతం చాలా పండ్లు విమాన మార్గం ద్వారా ఎగుమతి(Banana Export) అవుతున్నాయని భారత ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ఎందుకంటే పండ్లు పక్వానికి వచ్చే కాలం మారుతూ ఉంటుంది. దీంతో ఎగుమతి ప్రకారం వాటి పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అంటే పండ్లు ఎగుమతి చేయడం లో సమయం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో వేగంగా పండ్లను ఇతర దేశాలకు చేర్చడం పెద్ద టాస్క్. దీనిని అధిగమించడం కోసం భారతదేశం ఇప్పుడు సముద్ర మార్గం ద్వారా దాని ఎగుమతులను ప్రోత్సహించడానికి అరటి, మామిడి, దానిమ్మ మరియు జాక్‌ఫ్రూట్స్ వంటి తాజా పండ్లు - కూరగాయల కోసం సముద్ర ప్రోటోకాల్‌లను అభివృద్ధి చేస్తోంది. Also Read: సెన్సెక్స్ జోరు.. స్టాక్ మార్కెట్ రికార్డుల హోరు.. ఈ ర్యాలీ ఎందుకు? ఈ ప్రోటోకాల్‌లో ప్రయాణ సమయాన్ని అర్థం చేసుకోవడం, ఈ వస్తువులు.. పక్వానికి వచ్చే కాలాన్ని శాస్త్రీయంగా కొలవడం, నిర్దిష్ట సమయంలో పండ్లను పండించడం అలాగే ఈ విషయాలపై రైతులకు అవగాహన కల్పించడం వంటివి ఉంటాయి. ఈ ప్రోటోకాల్‌లు వేర్వేరు పండ్లు - కూరగాయలకు వేర్వేరుగా ఉంటాయి. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించే సంస్థ APEDA, ఈ విషయంలో ఇతర వాటాదారులతో కలిసి పనిచేస్తోంది. ఈ సంస్థ ఇటీవల అరటిపండ్ల(Banana Export) కోసం ఈ ప్రోటోకాల్‌లను అభివృద్ధి చేసింది. ఎగుమతి రూ.8300 కోట్లకు చేరుతుంది సముద్ర మార్గం ద్వారా నెదర్లాండ్స్‌కు అరటిపండ్ల(Banana Export)ను పంపే విజయవంతమైన ప్రయోగం తర్వాత, వచ్చే ఐదేళ్లలో ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన అరటిపండ్లను ఎగుమతి చేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద, రోటర్‌డామ్ రకం అరటి డిసెంబర్ 5న నెదర్లాండ్స్‌కు చేరుకుంది. ఈ సరుకును మహారాష్ట్రలోని బారామతి నుంచి పంపించారు. అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ, చైనా, నెదర్లాండ్స్, బ్రిటన్ - ఫ్రాన్స్‌లలో రానున్న రోజుల్లో భారత్ మరిన్ని అవకాశాలను అన్వేషిస్తుంది. ప్రస్తుతం, అరటిపండ్లు ప్రధానంగా భారతదేశం నుంచి మధ్య ఆసియా దేశాలకు ఎగుమతి(Banana Export) అవుతున్నాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద అరటి ఉత్పత్తిదారుగా ఉంది. ప్రపంచ అరటి ఉత్పత్తిలో 26.45 శాతం వాటా కలిగి ఉంది. కాగా అరటి ఎగుమతుల్లో భారత్ వాటా కేవలం ఒక శాతం మాత్రమే. భవిష్యత్ లో ఈ పరిస్థితి మార్చాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. Also Read : విజయ్ కాంత్ మన తెలుగోడే…ఆంధ్ర నుంచి వలస వెళ్లిన విజయ్ కాంత్ కుటుంబం..!! Watch this interesting Video: #banana #export-industry మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి