Prakasam District: ఉద్యోగం లేక.. పొలం లేక.. ఇంకేలా బ్రతకాలి.. ప్రకాశం జిల్లాలో గిరిజనుల ఆవేదన..!

ప్రకాశం జిల్లా దిగువమెట్టలోని గిరిజనలు DRO వంశీ కృష్ణపై అసహనం వ్యక్తం చేశారు. అడవి మీద ఆధారపడే తమకి అటవీ శాఖ నుండి సహకారం కరువైందని వాపోతున్నారు. అటవీ ఉత్పత్తులపై గిరిజనులకు హాక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

New Update
Prakasam District: ఉద్యోగం లేక.. పొలం లేక.. ఇంకేలా బ్రతకాలి.. ప్రకాశం జిల్లాలో గిరిజనుల ఆవేదన..!

Prakasam District: ప్రకాశం జిల్లా దిగువమెట్టలోని గిరిజనలు DRO వంశీ కృష్ణపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అడవి మీద ఆధారపడే బ్రతికే తమను అధికారులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వాపోతున్నారు. అటవీ శాఖ నుండి సహకారం కరువైందని ఆవేదన చెందుతున్నారు. అటవీ ఉత్పత్తులపై గిరిజనులకు హాక్కు కల్పించకుండ తమను వేధిస్తున్నాని ఆరోపిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తాతల కాలం నుండి అటవీ ఉత్పత్తులతోనే బ్రతుకుతున్నామని.. ఇప్పుడు వచ్చిన డీఆర్ఓ కఠినంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: థియేటర్ లో బీభత్సంగా కొట్టుకున్న పవన్, జగన్ ఫ్యాన్స్..!

తమపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలంటున్నారు. మమ్మల్నే కొట్టి మాపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవని, పొలం పనులు చేసేందుకు కనీసం ఎకర పొలం కూడా లేదని కన్నీటి పర్యంతం చెందుతున్నారు. తాము తాయారు చేసిన వస్తువులను అమ్ముకోనివ్వకుండా అధికారులే అమ్ముకుంటూ దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఉద్యోగం లేక పొలం లేక ఇంక ఏవిధంగా తాము బ్రతికాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గిరిజనలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అటవీ ఉత్పత్తులపై గిరిజనులకు హాక్కు కల్పించాలని వేడుకుంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు