బంగారు పతకాల కోసం భారత్ భారీ ఖర్చు!

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల శిక్షణ కోసం భారత క్రీడామంత్రిత్వశాఖ భారీ మొత్తంలోనే వెచ్చించింది. గత ఒలింపిక్స్ కంటే ఎక్కువ పతకాలు సాధించాలన్న లక్ష్యంతో కేంద్రం ఇప్పటి వరకూ 17 కోట్ల 90 లక్షల రూపాయలు ఖర్చు చేసింది.

New Update
Paris Olympics 2024 : ఒలింపిక్స్ కోసం 417 కోట్లు ఖర్చు..

పారిస్ లో ప్రారంభంకానున్న 2024 ఒలింపిక్స్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఒలింపిక్స్ బెర్త్ లు కోసం భారత అధ్లెట్ల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరిగే 33వ వేసవి ఒలింపిక్స్ లో 204 దేశాలకు చెందిన 10వేల మంది అథ్లెట్లు తలపడబోతున్నారు. ఈ వేదికలో భారత్ సైతం 130కి పైగా అథ్లెట్ల బృందంతో పాల్గోనుంది.

టోక్యో వేదికగా ముగిసిన 32వ ఒలింపిక్స్ క్రీడల్లో  నీరజ్ చోప్రా స్వర్ణపతకంతో చరిత్ర సృష్టిస్తే..మరో రెండు రజత, నాలుగు కాంస్యపతకాలు భారత్ కు దక్కాయి.ఒలింపిక్స్ లో పతకం సాధించే సత్తా కలిగిన అథ్లెట్లను ముందుగానే గుర్తించి..వారికి అత్యాధునిక శిక్షణ కల్పించడం కోసం భారత ప్రభుత్వం ఇప్పటి వరకూ 17 కోట్ల 90 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. 'టాప్స్ ' ( టార్గెట్ ఒలింపిక్ పోడియం ) పథకం ద్వారా క్రీడాకారుల శిక్షణ కోసమే భారత ప్రభుత్వం 6 కోట్ల 25 లక్షల రూపాయలు ఖర్చు చేసింది.

బ్యాడ్మింటన్ క్రీడాకారుల కోసం 5 కోట్ల 77 లక్షలు, షూటింగ్ క్రీడాకారుల కోసం 3 కోట్ల 83 లక్షలు, టెన్నిస్ ఆటగాళ్ల కోసం కోటీ 57 లక్షలు, పారా అథ్లెట్ల కోసం కోటీ 17 లక్షలు, కుస్తీ క్రీడాకారుల కోసం 55 లక్షలు, వెయిట్ లిఫ్టర్ల కోసం 43 లక్షలు, బాక్సర్ల కోసం 36 లక్షలు, విలువిద్య క్రీడాకారుల కోసం 20 లక్షలు, స్విమ్మర్ల కోసం 15 లక్షల రూపాయలు వెచ్చించింది.భారత్ కు కచ్చితంగా బంగారు పతకం సాధించే సత్తా కలిగిన జావలిన్ త్రో స్టార్ , గత ఒలింపిక్స్ లో స్వర్ణ విజేత నీరజ్ చోప్రా కోసం 'టాప్స్ ' పథకంలో భాగంగా 48 లక్షల 76వేల రూపాయలు ఖర్చు చేశారు. పారిస్ ఒలింపిక్స్ సన్నాహాలలో భాగంగా 176 రోజులపాటు విదేశీ ( దక్షిణాఫ్రికా, ఫిన్ లాండ్, జర్మనీ, టర్కీ)గడ్డ పైనే నీరజ్ శిక్షణ పొందాడు. 2023 డిసెంబర్ నుంచి 2024 మే వరకూ కేవలం నీరజ్ కోసమే భారత ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది.

రియో ఒలింపిక్స్ రజత, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతకాల విజేత ,తెలుగుతేజం పీవీ సింధు శిక్షణ కోసం 26 లక్షల 60 వేల రూపాయలు వెచ్చించారు. 36 రోజులపాటు విదేశాలలో శిక్షణ పొందడం ద్వారా పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పతకానికి సింధు గురిపెట్టింది.

Advertisment
తాజా కథనాలు