Viral: తన చర్మంతో తల్లికి చెప్పులు కుట్టించిన కొడుకు!

జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోవడం కోసం ఓ యువకుడు వినూత్న ప్రయత్నం చేశాడు. తన చర్మంతో చెప్పులు కుట్టించి కానుకగా ఇచ్చాడు రౌనక్ గుర్జర్. శ్రీరాముడే తనక ఆదర్శమని, రామాయణ దివ్యగాథ తనను ప్రభావితం చేసిందంటున్నాడు.

New Update
Viral: తన చర్మంతో తల్లికి చెప్పులు కుట్టించిన కొడుకు!

Madhya Pradesh: జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోవడం కోసం ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు. తన తల్లిపై తనకున్న ప్రేమానురాగాల్ని చాటుకునేందుకు వినూత్న ప్రయత్నం చేశాడు. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించాడు. ప్రస్తుతం ఈ వార్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవగా ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.

శ్రీరాముడే ఆదర్శం..
ఈ మేరకు మధ్యప్రదేశ్(Madhya Pradesh)కు చెందిన రౌనక్ గుర్జర్ (Raunak Gurjar)అనే వ్యక్తి ఈ సాహాసానికి పాల్పడ్డాడు. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తన తోలుతో కుట్టించిన చెప్పులను తల్లికి బహుమతిగా అందించాడు. ఇక తనకు శ్రీరాముడే ఆదర్శమని రౌనక్ గుర్జర్ అంటున్నాడు. తల్లి పట్ల ఓ కొడుకు చూపించిన ప్రేమ, వాత్సల్యం, గౌరవంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆస్తుల కోసం కన్నవారినే కడతేరుస్తున్న ఈ రోజుల్లో అతను చేసిన గొప్ప పనిని కొనియాడుతున్నారు. ఈరోజుల్లో రౌనక్ గుర్జార్ లాంటి కొడుకు ఉండటం నిజంగా గర్వ కారణమంటున్నారు.

ఇది కూడా చదవండి:Holi: హోలికా దహనం బూడిద మీ ఇంట్లో ఉందా.. అయితే అదృష్టవంతులే!

తల్లి రుణం తీర్చుకోలేనిది..
'రామాయణ దివ్యగాథ నన్ను చాలా ప్రభావితం చేసింది. చర్మంతో చెప్పులు కుట్టించి ఇచ్చినా తల్లి రుణం తీర్చుకోలేనిదని రాముడు చెప్పిన మాటలు నన్ను ఆకట్టుకున్నాయి. అందుకే నా చర్మంతో చెప్పులు కుట్టించి మా అమ్మకు కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నా. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవంతో సమానం. వారి పాదాల వద్దే స్వర్గం ఉంటుందని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నా' అని గుర్జర్ చెప్పాడు.

Advertisment
తాజా కథనాలు