Savings Tips: మనీ సేవింగ్స్ చాలా కష్టం కదా.. ఇలా చేస్తే అది ఇష్టంగా మారుతుంది!

మనకొచ్చే ఆదాయంలో పొదుపు చేయడం అనేది చాలా కష్టమైనా పనిగా భావిస్తాం. సేవింగ్స్ చేయాలంటే అవసరానికి కోరికకు మధ్యలో తేడా తెలియాలి. అంతేకాదు పొదుపు కోసం కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వచ్చు.  ఆ టిప్స్ ఏమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

New Update
Savings Tips: మనీ సేవింగ్స్ చాలా కష్టం కదా.. ఇలా చేస్తే అది ఇష్టంగా మారుతుంది!

Savings Tips: డబ్బు ఖర్చు చేయడం చాలా ఈజీ. కానీ, ఆదాయంలో కొంత పొదుపు చేయాలంటే ఆమ్మో కష్టం అంటాం. ఎందుకంటే, అవసరానికి.. కోరికలకు మధ్య ఉండే సన్నని గీత మనలో చాలామందికి తెలియదు. ఒక పక్క ధరలు పెరిగిపోతుంటాయి. మరోపక్క జీతాలు అంతంత మాత్రమే పెరుగుతాయి. అవసరాలు కూడా అధికం అవుతుంటాయి. అయితే, కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన ఆదాయంలో కనీసం కొంతభాగాన్ని సేవ్ చేసే అవకాశం దొరుకుతుంది. నిజానికి మనం మన సంపాదనలో 20 నుంచి 30 శాతాన్ని నెల ప్రారంభంలోనే సేవింగ్స్ లో పెట్టుకోవాలని ఆర్ధిక వేత్తలు థంబ్ రూల్ చెబుతారు. ఈ పొదుపు పద్ధతులు మనకి డబ్బును జాగ్రత్త చేసుకోవడంలో సహాయపడతాయి. 

ఆఫీసుకు కచ్చితంగా  లంచ్‌బాక్స్ తీసుకెళ్లండి
Savings Tips: మీరు ఆఫీసు లేదా కాలేజీకి వెళితే, ఇంటి నుండి లంచ్ (ఫుడ్ బాక్స్) తీసుకువెళ్ళడానికి ప్రయత్నించండి.. కాదు కాదు అదే అలవాటుగా మార్చుకోండి.  ఎందుకంటే ప్రతిరోజూ క్యాంటీన్ లేదా రెస్టారెంట్ ఫుడ్ తినడం మీ జేబుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా ఇది మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దానివలన ఆసుపత్రి ఖర్చులు కూడా తప్పవు కదా. ఫుడ్ కొనడానికి చేసే ఖర్చు.. ఆరోగ్యం కోసం చేసే ఖర్చు రెండు మిగుల్చుకోవాలంటే..  వీలైనంత వరకు ఇంటి నుంచే ఆహారాన్ని ప్యాక్ చేసి తీసుకెళ్లండి.

మెంబర్ షిప్స్ చెక్ చేస్తూ ఉండండి..
Savings Tips: మనం ఆన్ లైన్ కోర్సుల కోసం లేదా సర్వీసుల కోసం మెంబర్ షిప్ లేదా షబ్ స్క్రైబ్ చేయడం చేస్తుంటాం. పని అయిపోయాకా వాటిని క్లోజ్ చేయడం మర్చిపోవడం జరుగుతుంటుంది. అటువంటి వాటి వల్ల ఖర్చు వృధాగా అవుతుంది. అందుకే, ఎప్పటికప్పుడు ఇలాంటి వాటిని చెక్ చేసుకుని అవసరం లేని వాటిని క్యాన్సిల్ చేసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది. 

సకాలంలో బిల్లులు చెల్లించండి
Savings Tips: అన్ని బిల్లులను సకాలంలో చెల్లించండి. మీ బిల్లులను సకాలంలో చెల్లించని అలవాటు మీకు ఉంటే, వెంటనే మార్చండి.  ఎందుకంటే, బిల్లు ఆలస్యం అయితే లేట్ ఫీజులు భారీగా ఉంటాయి. ఒక్కోసారి మర్చిపోవడం వాళ్ళ కూడా బిల్లు పేమెంట్స్ లేట్ కావచ్చు. అందుకే, క్యాలెండర్ లో బిల్లుల చెల్లింపు తేదీలు మార్క్ చేసుకోండి. దీనిద్వారా బిల్లులు సమయానికి పే చేయవచ్చు. దీనివలన లేట్ ఫీజుల రూపంలో జరిగే వృధా ఖర్చులను అరికట్టవచ్చు. 

క్వాలిటీ ముఖ్యం..
Savings Tips: షాపింగ్ చేసేటప్పుడు మనం తరచుగా చౌకైన వస్తువులను కొనాలని.. దానిద్వారా డబ్బు మిగులుతుందని అనుకుంటాం. కానీ, దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. తక్కువ ధరలో కొన్న వస్తువుల నాణ్యత సరిగా ఉండకపోవచ్చు. అవి త్వరగా పాడయిపోవచ్చు. దీంతో మళ్ళీ ఆ వస్తువు కొనాల్సి రావచ్చు. అంటే, డబుల్ ఖర్చు అవుతుంది. అందుకే.. ఎప్పుడు క్వాంటిటీ కంటే క్వాలిటీ చూసుకుని వస్తువులు కోండం మంచిది. 

అవసరం అంటేనే..
Savings Tips: మొదట్లో చెప్పినట్టు మనలో చాలామందికి అవసరానికి-కోరికకు మధ్యలో తేడా తెలీదు. ఉదాహరణకు టీవీ ఇప్పుడు మనకు అవసరమైన వస్తువే. కానీ, చిన్న అద్దె ఇంటిలో ఉండే వారు పెద్ద టీవీ.. దానికి మ్యూజిక్ సిస్టం కొనుక్కోవడం కోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టడం మంచి పని కాదు కదా. ఇలాంటి అవసరానికి.. కోరికకు మధ్య తేడాలను గమనించుకుని వృధా అనిపించే ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా సేవింగ్స్ పెంచుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు