దేశరాజధానిలో ఆకస్మిక మార్పులు, భారీగా కురుస్తోన్న వర్షం..!!

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వర్షాలు కురుస్తాయని గతంలోనే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఢిల్లీలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఎండ వేడిమి నుంచి హస్తిన ప్రజలకు ఉపశమనం లభించింది. మరో మూడు, నాలుగు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

New Update
ఢిల్లీ, ముంబైలో దంచికొడుతున్న వానలు..!!

సోమవారం ఉదయం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రజలను ఆహ్లాదకరమైన వాతావరణం పలుకరించింది. తేలికపాటి వర్షాల కారణంగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వచ్చే 3 నుంచి 4 రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.  ప్రజలు నేటి నుండి రాబోయే మూడు రోజుల పాటు వేడి నుండి ఉపశమనం పొందుతారు. ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీలో తేలికపాటి వర్షం కురుస్తుంది. గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల వరకు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

publive-image

బిర్జోయ్ తుఫాను ప్రభావం ఇప్పుడు నెమ్మదిగా ప్రారంభమైంది. కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా వాతావరణ నమూనాలో మార్పు కనిపించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నాలుగైదు రోజుల్లో దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి వేడిగాలులు వీస్తాయని, దానితో రుతుపవనాలు వచ్చేస్తాయని ఐఎండీ తెలిపింది. వాతావరణ నిపుణుడు ఎస్పీ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. బిపార్జయ్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న రాష్ట్రాల్లో ఒకట్రెండు రోజుల్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టనుంది. చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్న చోట నాలుగైదు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఎండ వేడిమితో అల్లాడుతున్న ఉత్తర భారత రాష్ట్రాల్లో జూన్ 26-27 తేదీ వరకు వర్షాలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు