/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-10T163209.018-jpg.webp)
గత ఏడాది భారత్‌లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల ఉత్పత్తి(iPhone Production) విపరీతంగా పెరిగింది. గత సంవత్సరం వీటి ఉత్పత్తి సుమారు 14 బిలియన్ల డాలర్ల ఖరీదైన ఐఫోన్లను ఇండియాలో తయారు చేశారు. ఐఫోన్ల ఉత్పత్తిని రెండింతలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే చైనా నుంచి యాపిల్ సంస్థ దృష్టి మళ్లించడం వల్ల.. భారత్‌లో యాపిల్ ఉత్పత్తుల జోరు పెరిగింది. దీనిపై బ్లూమ్‌బర్గ్‌లో ఓ నివేదికను ప్రచురించారు.
భారత్‌లో సుమారు 14 శాతం యాపిల్ ఉత్పత్తుల తయారీ జరుగుతున్నదని ఆ సంస్థ వెల్లడించింది. అంటే ఏడు డివైస్‌లను తయారు చేస్తే దాంట్లో ఒకటి ఇండియాలోనే తయారు అవుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో వెల్లడించింది. భారత్‌లో ఉత్పత్తి పెంచడం వల్ల .. ఇన్నాళ్లూ చైనాపై ఆధారపడ్డి యాపిల్ సంస్థ.. ఇప్పుడు ఆ దేశంపై తన అవసరాన్ని తగ్గించుకున్నది. ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనూ ఉత్పత్తి తగ్గినట్లు తెలుస్తోంది.