Union Budget 2024: మన దేశ బడ్జెట్ ఎలా సిద్ధం చేస్తారో తెలుసా? ఆర్ధిక మంత్రి అన్ని నిర్ణయాలూ తీసుకుంటారా? 

బడ్జెట్ అనగానే ఆర్ధికమంత్రి మొత్తం దానిని సిద్ధం చేస్తారని అనుకుంటాం. కానీ, బడ్జెట్ తయారీలో చాలా దశలు ఉంటాయి. చివరి దశలో హల్వా వేడుక తరువాత బడ్జెట్ పత్రాలు ప్రింట్ అవుతాయి. బడ్జెట్ ప్రక్రియలో చాలామంది పాల్గొంటారు. బడ్జెట్ ఎలా సిద్ధం చేస్తారో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

Union Budget 2024: మన దేశ బడ్జెట్ ఎలా సిద్ధం చేస్తారో తెలుసా? ఆర్ధిక మంత్రి అన్ని నిర్ణయాలూ తీసుకుంటారా? 
New Update

Union Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతామారన్‌ మూడో దఫా మోదీ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను మరి కొద్దిసేపట్లో  ప్రవేశపెట్టనున్నారు.  హల్వా వేడుకను నిర్వహించిన తరువాత..  బడ్జెట్ తయారీలో లాక్డ్ రూమ్ లో అధికారులు బడ్జెట్ తయారీలో నిమగ్నమయిన అధికారులు బడ్జెట్ సిద్ధం చేశారు.  భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112లో బడ్జెట్ గురించి పేర్కొన్నారు. దీనిని దేశ వార్షిక ఆర్థిక నివేదికగా నమోదుచేస్తారు. బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి ఒక ప్రక్రియ ఉంది. అలాగే, దాని కోసం ప్రత్యేక విభాగం ఉంది. బడ్జెట్‌ను ఎలా తయారు చేస్తారు? దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి అన్ని నిర్ణయాలు తీసుకుంటారో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. 

బడ్జెట్‌ను ఎవరు రూపొందిస్తారు?

Union Budget 2024:  బడ్జెట్‌లో ప్రభుత్వ ఆదాయ, వ్యయాల వివరాలు ఉంటాయి. దీన్ని సిద్ధం చేసే పనిని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ విభాగం చేస్తుంది. బడ్జెట్ విభాగం బృందం దీనిని సిద్ధం చేస్తుంది. బడ్జెట్ తయారీ సాధారణంగా సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. ఇది అనేక దశల్లో తయారు చేయాల్సి ఉన్నందున దీనికి చాలా సమయం పడుతుంది.

మొదటి దశలో,  ఖర్చులు - అవసరాలు అంచనా వేస్తారు. అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, స్వయంప్రతిపత్త సంస్థలు, విభాగాలు, సైనిక బలగాల నుండి రాబోయే సంవత్సరానికి అంచనా వ్యయం గురించి సమాచారం సేకరిస్తారు. వీటినన్నిటిని క్రోడీకరించి ఒక అంచనా తయారు చేసుకుంటారు. 

రెండవ దశలో, ఆర్థిక వ్యవహారాలు-ఆదాయానికి సంబంధించిన విభాగాలు..  వ్యాపారవేత్తలు, ఆర్థికవేత్తలు, పౌర సమాజం,  రైతులతో చర్చలు జరుపుతాయి. బడ్జెట్ తయారీకి ముందు ఏఈ చర్చలు జరుగుతాయి. వీటి ద్వారా ఆయా వర్గాల అవసరాలు.. కోరికలు.. ఏమున్నాయో అర్ధం చేసుకునేందుకు అవకాశం దొరుకుతుంది. 

మూడో దశలో, బడ్జెట్‌ను రూపొందించే శాఖల నుంచి ఆదాయ, వ్యయాల వివరాలను సేకరిస్తారు. దీని ఆధారంగా, రాబోయే సంవత్సరంలో అంచనా ఆదాయాలు - ఖర్చుల వివరాలను తయారు చేస్తారు. దీని తరువాత, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థికవేత్తలు, బ్యాంకర్లతో మాట్లాడి పన్ను మినహాయింపు అలాగే, ఆర్థిక సహాయంపై నిర్ణయం తీసుకుంటుంది. 

చివరగా ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్(Union Budget 2024) ప్రసంగం సిద్ధం చేసే పనిని ప్రారంభిస్తుంది  నిర్దిష్ట విభాగంలో మొత్తానికి సంబంధించి వివాదం ఉంటే, కేబినెట్ మంత్రి లేదా ప్రధాన మంత్రి నుండి కూడా సలహా తీసుకుంటారు. ఒక బృందం దానిని సిద్ధం చేసే పని చేస్తుంది.  వారు అనేక నిర్ణయాలు తీసుకుంటారు. అయితే దీని కోసం తీసుకునే ప్రతి నిర్ణయమూ ఆర్థిక మంత్రిదేనని సాధారణంగా మనమందరం అనుకుంటూ ఉంటాం. 

Also Read: అగ్నిపథ్ ప్రాజెక్ట్ లో కీలక మార్పులు.. బడ్జెట్ లో ప్రతిపాదనలు వస్తాయా?

బడ్జెట్ ప్రింటింగ్ హల్వా వేడుకతో ప్రారంభమవుతుంది

Union Budget 2024:  యూనియన్ బడ్జెట్ ముద్రణ ప్రక్రియ "హల్వా వేడుక" అనే సంప్రదాయ వేడుకతో ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో, ఆర్థిక మంత్రి - ప్రక్రియలో పాల్గొన్న ఇతర అధికారులు,  ఉద్యోగులు సాంప్రదాయ హల్వా తింటారు. ఈ ఈవెంట్ తర్వాత, కేంద్ర బడ్జెట్ ముద్రణ ప్రారంభమవుతుంది. ఈ దశ మొత్తంలో, బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు..  సిబ్బంది అందరూ మంత్రిత్వ శాఖ ప్రాంగణానికి పరిమితమై ఉంటారు.  బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు. హల్వా హంగామా పూర్తి అయిన తరువాత నుంచి బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేంత వరకూ వారంతా అక్కడే ఉంటారు. ఎందుకంటే వారికి బడ్జెట్ కు సంబంధించిన మోత్తం సమాచారంపై అవగాహన ఉంటుంది. వారిలో ఎవరి నుంచైనా బడ్జెట్ విషయాలు లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో అంటే 1950లో బడ్జెట్ లీక్ అయిన సంఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి బడ్జెట్ లీక్ కాకుండా ఉండటం కోసం ఈ విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి ముందుగా కేబినెట్ సమావేశంలో పాల్గొని బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదం తీసుకుంటారు.  ఆ తర్వాత బడ్జెట్ ను సభలో సమర్పిస్తారు.







#union-budget-2024 #budget-aspirations
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe