/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/cumin-price.webp)
నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగుతన్నాయి. నిన్నమొన్నటివరకు వంట నూనెధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పుడు వంటలో వినియోగించే ప్రధానమైన సుగంధ ద్రవ్యమైన జీలకర్ర ధరలు సామాన్యునికి పగలే చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బనం 25నెలల కనిష్టానికి చేరుకోవడంతో..టోకు ద్రవ్యోల్బణం మైనస్ 3.50శాతానికి చేరింది. అయినా కూడా సామాన్యుల సమస్య అంతా కూడా వంటగదిలోనే ఉంది. అయినా సామాన్యుడి కష్టాలు ఎవరికీ పట్టవు. పాలు, పప్పు ధరలు తగ్గడం లేదు. పోపుపెట్టేలో ఉంచే జీలకర్ర కూడా బంగారంతో సమానం ధర పలుకుతోంది. జీలకర్ర ధర నేడు క్వింటాల్ కు రూ. 60వేలకు పైగానే పలుకుతుంది.
భారతీయుల వంటకాల్లో జీలకర్రకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి వంటకంలోనూ జీలకర్రను వినియోగిస్తుంటారు. జీలకర్ర జోడిస్తే ఆ రుచే వేరుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీని ధరలు ఆకాన్నంటడం ప్రారంభిస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటనే ఆందోళన మొదలైంది. గుజరాత్ లోని ఉంఝా మండిలో జీలకర్ర ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు జీలకర్ర ధర రూ. 60వేలకు పైగానే పెరిగింది. కొన్నాళ్ల క్రితం జీలకర్ర ధర 67వేలుగా నమోదు అయ్యింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తొమ్మిదేళ్లలో జీలకర్ర ధర 500శాతానికి పెరిగింది. వ్యవసాయానికి సంబంధించిన 20 వస్తువుల్లో జీలకర్ర ధర మాత్రమే భారీగా పెరిగింది.
9ఏళ్లలో 500శాతం పెరిగిన జీలకర్ర ధర:
జూన్ 2, 2014న జీలకర్ర ధర రూ.11,120 పలికింది. జూన్ 22న క్వింటాల్‌కు రూ.67,500తో భారీగా పెరిగిపోయింది. అంటే ఈ లెక్కల ప్రకారం జీలకర్ర ధరలు 500 శాతానికి పైగా పెరిగాయి. కాగా, జూన్ 26న ఊంఝా మండిలో జీలకర్ర ధర రూ.60,125కి తగ్గగా...దాదాపు 9 ఏళ్లలో జీలకర్ర ధరల్లో 441 శాతం పెరుగుదల కనిపించింది.
భవిష్యత్తులో ఎన్‌సిడిఎక్స్ డేటా ప్రకారం, ఆగస్టులో జీలకర్ర క్వింటాల్‌కు రూ. 58,205 వద్ద ముగిసింది. ఇది ట్రేడింగ్ సెషన్‌లో రూ. 58,750కి చేరుకోగా... అంతకుముందు రోజుతో పోలిస్తే 5 శాతానికి పైగా పెరిగింది.ఇక జీలకర్ర ధర భారీస్థాయిలో పెరగడానికి కారణం డిమాండ్, సప్లయ్ మధ్య అసమతుల్యత ఏర్పడటమేనని మార్కెట్ అధికారులు అంటున్నారు.
జీలకర్ర ధర ఎందుకు పెరుగుతోంది?
భారత్ లో జీలకర్ర ఉత్పత్తి 2019-20లో 9.12 లక్షల టన్నులు కాగా..., 2020-21లో 7.95 లక్షల టన్నులకు తగ్గింది. 2021-22లోనూ 7.25 లక్షల టన్నులకు తగ్గింది. ప్రధానంగా ఈసారి మార్చి ద్వితీయార్థంలో కురిసిన అకాల వర్షాల కారణంగా 2022-23 పంట దిగుబడి తగ్గిందని అధికారులు భావిస్తున్నారు.తక్కువ ఉత్పత్తి మాత్రమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం కాకపోవచ్చు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ స్పైస్ స్టేక్‌హోల్డర్స్ ప్రకారం, ఫిబ్రవరి 2022లో క్యారీ-ఫార్వర్డ్ స్టాక్‌లో దాదాపు 35 లక్షల బ్యాగులు ఉన్నాయి. చివరి పంట ప్రారంభానికి ముందు. ఈసారి 2021-22 పంట క్యారీ ఫార్వార్డ్ 3-4 లక్షల బస్తాలు మాత్రమే ఉండగా... వ్యాపారుల వద్ద నిల్వలు తక్కువగా ఉండడం, ఉత్పత్తి పడిపోవడంతో ధరల పెరుగుదలకు కారణం అవుతుంది.
భారత్ లో 70శాతం జీలకర్ర ఉత్పత్తి:
ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే జీలకర్ర 70శాతం ఉత్పత్తి భారత్ లోనే ఉంది. భారత్ తర్వాత సిరియా, టర్కి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ వంటి దేశాలు 30శాతం జీలకర్రను సాగు చేస్తున్నాయి. కాగా మనదేశంలో రాజస్తాన్, మధ్యప్రదేశ్ లో మాత్రమే జీలకర్రను ఎక్కువగా సాగుచేస్తున్నారు.