Makara Sankranti: సంక్రాంతి మనతో పాటు ఈ దేశాలు కూడా జరుపుకుంటాయి 

మకర సంక్రాంతి పండగ మనం ఎంతో ఘనంగా జరుపుకుంటాం. అయితే, ఇది మన దేశంలోనే కాదు మరి కొన్ని దేశాల్లోనూ పెద్ద పండగే. మన పొరుగున ఉండే శ్రీలంక, మయన్మార్, థాయ్ లాండ్ దేశాల్లో సంక్రాంతి వేడుక ఉంటుంది. అయితే, మనకంటే కొంచెం భిన్నంగా పండగ చేసుకుంటారు అక్కడ. 

New Update
Makara Sankranti: సంక్రాంతి మనతో పాటు ఈ దేశాలు కూడా జరుపుకుంటాయి 

Makara Sankranti: ఈ సంవత్సరం ఉత్తరాయణ పండుగ అంటే మకర సంక్రాంతిని  జనవరి 15న (January 15) దేశమంతా వేడుకగా జరుపుకోవడానికి సిద్ధం అయిపోయింది.  ఈ రోజున సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. భారతదేశమంతటా ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటారు. మకర సంక్రాంతికి స్నానం..  దానధర్మాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి గంగానదిలో స్నానాలు చేస్తుంటారు.

కానీ ఈ ఉత్తరాయణ పండుగ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా జరుపుకుంటారు. అవును, ఇది మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ, మన  పొరుగు దేశాలలో కూడా జరుపుకునే ఈ పండుగ భారతదేశంలో కొత్త సీజన్ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు. మకర సంక్రాంతి పండుగను ఏయే దేశాల్లో జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీలంక (Sri Lanka)
శ్రీలంక భారతదేశానికి దక్షిణాన ఉంది.  అయితే ఇక్కడ కూడా మకర సంక్రాంతి (Makara Sankranti) ని జరుపుకుంటారు. ఇక్కడ ఈ పండుగను జరుపుకోవడానికి భిన్నమైన సంప్రదాయాన్ని అనుసరిస్తారు. శ్రీలంకలో మకర సంక్రాంతిని ఉజాహవర్ తిరనాల్ అంటారు. ఇక్కడ కొందరు దీనిని పొంగల్ (Pongal) అని కూడా అంటారు. దీనికి కారణం ఇక్కడ తమిళనాడుకు చెందిన వారు అధిక సంఖ్యలో నివసించడమే.

Also Read: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో మొదటి జిమ్ ఎక్కడంటే.. 

మయన్మార్ (Myanmar)
మయన్మార్‌లో ఈ పండుగ ను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇక్కడ తినాగ్యాన్ (Thingyan) పేరుతో జరుపుకుంటారు. మయన్మార్‌లోని మకర సంక్రాంతి పండుగ బౌద్ధ సమాజంతో ముడిపడి ఉంది. ఈ పండుగ 3 నుంచి 4 రోజుల పాటు జరుగుతుంది. నూతన సంవత్సర ఆగమనాన్ని పురస్కరించుకుని ఇక్కడ కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటారని నమ్ముతారు.

థాయిలాండ్ (Thailand)
మకర సంక్రాంతి పండుగను థాయ్‌లాండ్‌లో కూడా జరుపుకుంటారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీనిని థాయ్‌లాండ్‌లో సాంగ్‌కార్న్ (Songkran) అని పిలుస్తారు. పురాతన కాలంలో, థాయ్‌లాండ్‌లోని ప్రతి రాజుకు తన స్వంత ప్రత్యేక గాలిపటం ఉండేది. దేశంలో శ్రేయస్సును కాంక్షిస్తూ సన్యాసులు, పూజారులు ఈ గాలిపటాన్ని చలిలో ఎగురవేసేవారు. థాయ్‌లాండ్ రాజులు మాత్రమే కాకుండా ప్రజలు కూడా తమ ప్రార్థనలను దేవునికి తెలియజేయడానికి గాలిపటాలు ఎగురవేసేవారు.

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు