టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం..!

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ కేసులో ఓ వైపు విచారణ వేగవంతమై కొలిక్కి వస్తుంటే.. మరో వైపు అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో సిట్ అధికారులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 99కి చేరింది..

New Update
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం..!

TSPSC Paper leak Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ కేసులో ఓ వైపు విచారణ వేగవంతమై కొలిక్కి వస్తుంటే.. మరో వైపు అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో సిట్ అధికారులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 99కి చేరింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ కు సహకరించిన ఆరోపణలతో ఈ ముగ్గురిని సిట్ అరెస్ట్ చేసినట్టు పేర్కొంది.

నిందితులు 100 కు పైనే..!

టీఎస్పీఎస్సీ కేసులో..విచారణ లోతుగా వెళుతున్న కొద్దీ అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. కాగా, ఛైన్ లా ఒకరి ద్వారా ఒకరు ఈ కేసులో నేరస్తులుగా నిలుస్తున్నారు. పేపర్ ను లీక్ చేసిన వాళ్ల దగ్గర్నుంచి కొన్నవాళ్లు తిరిగి విక్రయించడం.. అలా కొనుగోలు చేసిన వారు వేరే వాళ్లకు ప్రశ్నా పత్రాలను విక్రయించి సొమ్ము చేసుకోవడంతో.. నేరస్థుల లిస్ట్ పెరుగుతూ పోతుంది. దీంతో ఇప్పటి వరకు 99 మందిని సిట్ అధికారులు ఈ కేసులో అరెస్ట్ చేశారు. దీన్ని బట్టి ఈ కేసు విచారణ ముగిసే సమయానికి వందకు పైనే నిందితులుండే అవకాశముంది.

ఇక అతిత్వరలోనే కేసును క్లోజ్ చేయాలని భావిస్తున్న సిట్ అధికారులు.. విచారణను వేంగంగా చేస్తున్నారు. దాదాపుగా 90 శాతం కొలిక్కి వచ్చిన ఈ కేసులో నివేదికను అధికారులు త్వరలోనే సమర్పించనున్నారు.

ఏ2 కి బెయిల్ తిరస్కరించిన కోర్టు..!

ఇప్పటికే ఈ కేసులో ప్రధాననిందితులుగా ఉన్న కొందరికి వివిధ కారణాలతో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఏ2 గా ఉన్న టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరిపిన నాంపల్లి కోర్టు బెయిల్ ను తిరస్కరించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు